NTV Telugu Site icon

ఐపీఎల్ 2021: ఓపెన‌ర్లు రాణించినా… ముంబైకు త‌ప్ప‌ని ఓట‌మి…

ముంబై, కోల్‌క‌తా దేశాల మ‌ధ్య జ‌రిగిన టీ20 మ్యాచ్‌లో కోల్‌క‌తా జ‌ట్టు అద్భుతమైన విజ‌యాన్ని సాధించింది.  టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కోల్‌క‌తా జ‌ట్టు ముంబైని త‌క్కువ స్కోర్‌కే క‌ట్ట‌డి చేయ‌డంలో స‌క్సెస్ సాధించింది.  ఓపెన‌ర్లు రోహిత్ శ‌ర్మ‌, డీకాక్‌లు రాణించిన‌ప్ప‌టికి మిగ‌తా బ్యాట్స్మెన్‌లు పెద్ద‌గా రాణించ‌లేక‌పోవ‌డంతో 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల‌కు 155 ప‌రుగులు చేసింది.  ఇది గౌర‌వ‌ప్ర‌ద‌మైన స్కోరే అయిన‌ప్ప‌టికీ, కోల్‌క‌తా జ‌ట్టు బ్యాటింగ్ లైన‌ప్ బ‌లంగా ఉండ‌టంతో పెద్ద ఇబ్బంది లేకుండానే సునాయాసంగా విజ‌యం సాధించ‌గ‌లిగింది.  రాహుల్ త్రిపాఠి 74 ప‌రుగుల‌తో, వెంక‌టేశ్ అయ్య‌ర్ 53 ప‌రుగుల‌తో రాణించ‌డంతో కేవ‌లం మూడు వికెట్లు మాత్ర‌మే కోల్పోయి ల‌క్ష్యాన్ని సాధించింది.  దీంతో కోల్‌క‌తా వ‌ర‌స‌గా రెండు మ్యాచ్‌ల‌లో విజ‌యం సాధించ‌గా, ముంబై రెండు మ్యాచ్‌ల‌లో ఓట‌మిపాలైంది.  

Read: సెప్టెంబ‌ర్ 24, శుక్ర‌వారం దిన‌ఫ‌లాలు…