Site icon NTV Telugu

Kolkata Metro: నీటి అడుగున ట్రయల్ రన్.. చరిత్ర సృష్టించిన కోల్‌కతా మెట్రో

Kolkata Metro

Kolkata Metro

కోల్‌కతా మెట్రో కొత్త మైలురాయిని సాధించింది. దేశంలో మొదటిసారిగా హుగ్లీ నది కింద నీటి అడుగున సొరంగం ద్వారా కోల్‌కతా మెట్రో విజయవంతంగా ట్రయల్ రన్ నిర్వహించింది. నది కింద మెట్రో రేక్ తన ప్రయాణాన్ని పూర్తి చేయడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి. కోల్‌కతా మెట్రోకు చెందిన సీనియర్ అధికారులు, ఎంపిక చేసిన ఇంజనీర్లు మాత్రమే ట్రయల్ రన్ సమయంలో అందులో ప్రయాణించారు. హౌరా నుండి ఎస్ప్లానేడ్ వరకు విస్తరించి ఉన్న మార్గం పొడవు సుమారు 4.8 కి.మీ. ఇందులో 520 మీటర్లు హుగ్లీ నది కింద సొరంగం ద్వారా ఉంటుంది. సొరంగం నీటి ఉపరితల మట్టం కింద 32 మీటర్లు ఉంది.
Also Read:Breaking: విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణలో కీలక మలుపు..

నగరానికి ఇది చారిత్రాత్మక ఘట్టమని కోల్‌కతా మెట్రో జనరల్ మేనేజర్ పి.ఉదయ్ కుమార్ రెడ్డి అభివర్ణించారు. ఇది ప్రారంభం మాత్రమేనని, ఈ మార్గంలో సాధారణ నీటి అడుగున ట్రయల్ రన్ త్వరలో ప్రారంభమవుతుందని చెప్పారు. మహాకరణ్ స్టేషన్ నుండి హౌరా మైదాన్ స్టేషన్ వరకు ప్రయాణించిన మొదటి ట్రయల్ రన్‌లో ఆయన ఉన్నారు. ఈ మార్గంలో వచ్చే ఏడు నెలల పాటు రెగ్యులర్ ట్రయల్ రన్ నిర్వహిస్తామని ఉదయ్ కుమార్ రెడ్డి చెప్పారు. ఆ తరువాత, సాధారణ ప్రజలకు సాధారణ సేవలు ప్రారంభమవుతాయని ఆయన తెలిపారు. అనేక అడ్డంకులను అధిగమించి హుగ్లీ నది క్రింద రేక్‌లను నడపడంలో తాము విజయం సాధించామన్నారు. ఇది మెట్రో రైల్వేకు చారిత్రాత్మక క్షణం అని పేర్కొన్నారు. కోల్‌కతా, నగర శివారు ప్రాంతాల ప్రజలకు ఆధునిక రవాణా వ్యవస్థను అందించడంలో ఇది విప్లవాత్మకమైన చర్య అని తెలిపారు. బెంగాల్ ప్రజలకు భారతీయ రైల్వేలు అందించిన ప్రత్యేక నూతన సంవత్సర కానుక ఇది అని పేర్కొన్నారు.

Also Read:Girl kidnapped Ex Boyfriend: ప్రియుడితో కలిసి ఎక్స్‌ లవర్‌ని కిడ్నాప్‌ చేసిన యువతి.. నగ్నంగా మార్చి చిత్ర హింసలు..!

Exit mobile version