NTV Telugu Site icon

ఉభయ గోదావరి జిల్లాల్లో జోరుగా కోడి పందాలు..

సంక్రాంతి పండుగ వచ్చిదంటే చాలు కోడి పందాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏపీలో సంక్రాంతి పండుగ వేళ కోడి పందాలు జోరుగా కొనసాగుతాయి. అయితే కోడి పందాలు సంప్రదాయ బద్ధంగానే నిర్వహించాలని కోర్టులు తెలుపుతున్నా.. కోర్డుల ఆదేశాలను భేఖాతరు చేస్తున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో జోరుగా కోడి పందాలు ప్రారంభమయ్యాయి. భీమవరం, ఉంది, వెంప, దెందులూరు, తణుకు, అమలాపురం, రావులపాలెంలో భారీగా తమ కోళ్లను బరిలోకి దించేందుకు సిద్ధంగా ఉన్నారు.

ముమ్మిడివరం, రామచంద్రాపురం, కాకినాడ, రాజానగరం, ఐ.పోలవరం, రాజోలులో కోడి పందాలు నిర్వహిస్తున్నారు. అయితే ప్రజాప్రతినిధుల సమక్షంలోనే కోడిపందాల నిర్వాహణ జరుగుతుండడం గమనార్హం. కోడి పందాల వద్ద కోట్ల రూపాయలు చేతులు మారుతున్నట్లు తెలుస్తోంది. అయితే కోట్ల రూపాయలు చేతులు మారుతున్నా పోలీసులు మాత్రం పట్టించుకోవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు.