Site icon NTV Telugu

రోహిత్ స్థానంలో వన్డేలకు కెప్టెన్‌గా కేఎల్ రాహుల్?

దక్షిణాఫ్రికాలో పర్యటిస్తున్న టీమిండియాకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ ఇప్పటికే టెస్టు సిరీస్‌కు దూరంగా కాగా ఇప్పుడు వన్డేలకు కూడా దూరం కానున్నాడని ప్రచారం జరుగుతోంది. తొడ కండరాల గాయంతో రోహిత్ శర్మ టెస్టులకు దూరంగా ఉన్నాడు. దీంతో అతడు ప్రస్తుతం బెంగళూరు నేషనల్ క్రికెట్ అకాడమీలో చికిత్స తీసుకుంటూ పూర్తి ఫిట్‌నెస్ సాధించేందుకు కృషి చేస్తున్నాడు. దీంతో వన్డే సిరీస్ సమయానికి హిట్ మ్యాన్ సిద్ధమవుతాడని అందరూ భావించారు.

Read Also: తొలి ఇన్నింగ్స్‌లో 327 పరుగులకు భారత్ ఆలౌట్

అయితే తాజాగా రోహిత్ తొడ కండరాల గాయం నుంచి కోలుకోవడానికి 4 నుంచి 6 వారాలు పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ క్రమంలో వన్డే కెప్టెన్సీని కేఎల్ రాహుల్‌కు అప్పగిస్తారని సమాచారం. ఇటీవల వన్డే కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీని తప్పించి రోహిత్ శర్మకు పగ్గాలు అప్పగించిన విషయం తెలిసిందే. ఈ విషయం భారత క్రికెట్‌లో పెద్ద దుమారం లేపింది. గంగూలీకి, కోహ్లీకి మధ్య విభేదాలు ఉన్నాయని మీడియా తెగ ప్రచారం చేసింది. ఇప్పుడు వన్డేలకు రోహిత్ దూరం కానుండటంతో కేఎల్ రాహుల్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. జనవరి 19 నుంచి 23 వరకు భారత్, సౌతాఫ్రికా జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ జరగనున్న సంగతి తెలిసిందే.

Exit mobile version