ఐపీఎల్ 2021 లో ఈరోజు ఫైనల్ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య జరుగుతుంది. అయితే ఈ మ్యాచ్లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు వచ్చిన చెన్నై జట్టు శుభారంభం చేసింది. ఓపెనర్లు ఇద్దరు మొదటి వికెట్ కు 61 పరుగులు జోడించిన తర్వాత రుతురాజ్ గైక్వాడ్ 32 పరుగుల వద్ద పెవిలియన్ చేరుకోగా ఫాఫ్ డుప్లెసిస్(86) అర్థ శతకం సాధించి చివరి బంతికి అవుటయ్యాడు. అలాగే రాబిన్ ఊతప్ప 31 పరుగులు చేస్తే… మోయిన్ అలీ 37 పరుగులతో ఆకట్టుకున్నారు. దాంతో నిర్ణీత 20 ఓవర్లలో చెన్నై జట్టు మూడు వికెట్ల నష్టానికి 192 పరుగులు చేయగలిగింది.
ఇక కేకేఆర్ బౌలర్లలో సునీల్ నరైన్ రెండు వికెట్లు… శివమ్ మావి ఒక వికెట్ పడగొట్టారు. అయితే ఈ మ్యాచ్లో విజయం సాధించి ఐపీఎల్ 14 సీజన్ విజేతగా నిలవాలంటే కేకేఆర్ జట్టు 193 పరుగులు చేయాలి. కానీ బలమైన చెన్నై బౌలింగ్ ను ఎదురుకుని ఈ భారీ లక్ష్యాన్ని ఛేదించడం కేకేఆర్ కు కష్టమైన పని అని చెప్పాలి. అయితే ఈ టైటిల్ వేటలో ఈరోజు ఎవరు గెలుపొందితారో చూడాలి మరి.