Site icon NTV Telugu

తడబడ్డ కోహ్లీ సేన… కేకేఆర్ టార్గెట్ ఎంతంటే ?

ఐపీఎల్‌ 2021 ఎలిమినేట‌ర్ మ్యాచ్‌ బెంగ‌ళూరు, కోల్‌క‌తా జట్ల మధ్య ఇవాళ జరుగుతున్న సంగతి తెలిసిందే. షార్జా వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌ లో టాస్‌ నెగ్గిన రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టు మొదట బ్యాటింగ్‌ ఎంచుకుంది. అయితే.. మొదట బ్యాటింగ్‌ చేసిన బెంగళూరు జట్టు 20 ఓవర్లలో ఏకంగా 7 వికెట్లు కోల్పోయి… కేవలం 138 పరుగులు మాత్రమే చేసింది. కోహ్లి 39 పరుగులు మరియు పడిక్కల్‌ 21 పరుగులు మినహా మిడిలార్డర్‌ బ్యాట్స్‌ మెన్లు పూర్తి గా విఫలం కావడంతో బెంగళూరు జట్టు… కేవలం 138 పరుగులే చేసింది. ఇక కేకేఆర్‌ జట్టు బౌలర్లలో సునీల్‌ నరైన్‌ ఏకంగా 4 వికెట్లు పడగొట్టి.. బెంగళూరు నడ్డి విరిచాడు. కాగా… ఈ మ్యాచ్‌ లో కేకేఆర్‌ జట్టు గెలవాలంటే… 20 ఓవర్లలో 139 పరుగులు చేయాల్సి ఉంటుంది. మరి కాసేపట్లోనే.. కేకేఆర్‌ ఛేజింగ్‌ ప్రారంభం కానుంది.

Exit mobile version