Site icon NTV Telugu

ఏపీలో రూ.50కే కిలో మటన్..! ఎందుకో తెలుసా..?

ఒకప్పుడు పండగరోజే.. లేదా ఏదైనా ప్రత్యేకమైన రోజునో మాంసం వండుకునేవారు.. కానీ, క్రమంగా మాంసానికి డిమాండ్‌ పెరుగుతూ వచ్చింది… వారానికి రెండు మూడు రోజులైనా మటన్‌ లేదా చికెన్‌ ఉండాల్సిందే.. లేదా కనీసం సండే అయినా ముక్క ఉంటేనే ముద్ద దిగుతోంది.. ఏ ఫంక్షన్‌ అయినా.. ముక్క ఉంటేనే.. అది ఫంక్షన్‌ కింద లెక్క అనే స్థాయికి వెళ్లిపోయింది పరిస్థితి.. అయితే, హైదరాబాద్‌ లాంటి సిటీల్లో కిలో మటన్‌ ధర ఏకంగా రూ.800కు చేరింది. అయితే, ఆంధ్రప్రదేశ్‌లో ఒక్క దగ్గర మాత్రం కేవలం రూ.50కే కిలో మటన్‌ చొప్పున విక్రయాలు జరిగాయి. దీంతో.. ఎగబడి మరీ మటన్‌ కొనుగోలు చేశారు వినియోగదారులు.

Read Also: ఏపీ సర్కార్‌ కీలక నిర్ణయం.. సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసుల్లోకి వారికి నో ఎంట్రీ..!

రూ.50 కే కిలో మటన్‌కు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. వాల్మీకిపురంలో ఆదివారం రోజు కిలో మటన్ రూ.50గా పలికింది.. ఆదివారం సాయంత్రం వ్యాపారస్తుల మధ్య తీవ్రమైన పోటీ నెలకొనడంతో.. ఇలా విక్రయాలు జరిగినట్టు తెలుస్తోంది.. వాల్మీకిపురంలోని గాంధీ బస్టాండ్‌ వద్ద ఉన్న ఓ మాంస విక్రయదారుడు మొదట కిలో మటన్‌ రూ.300గా విక్రయించాడు.. అయితే, ఇతర వ్యాపారస్తులు పోటీపడంతో.. అది కాస్తా రూ.200.. ఆ తర్వాత రూ.100.. ఇలా కిందకు దిగుతూ వచ్చింది.. చివరకు ఓ దుకాణాదారుడైతే కేవలం రూ.50కే కిలో మటన్‌ అంటూ.. విక్రయాలు సాగించాడట.. ఇలా వ్యాపారస్తులు పోటీ పడి.. చివరకు కిలో రూ.50కే విక్రయించడం హాట్ టాపిక్‌గా మారిపోయింది.. కొనుగోలుదారులు సైతం పోటీ పడడం.. ఒక్కొక్కరు కిలో, రెండు కిలోలు, ఐదు నుంచి పది కిలోల వరకు కొనుగోలు చేయడంతో రాత్రి 7.30 గంటల వరకే స్టాక్‌ మొత్తం అయిపోయినట్టుగా చెబుతున్నారు. అయితే, గతం వారం రోజులుగా అక్కడ మాత్రం కిలో మటన్ రూ.400-500 పలకగా.. పోటీతో మాత్రం ఆ ధర అమాంతం దిగివచ్చింది.

Exit mobile version