World Boxing Championship: బాక్సర్ నిఖత్ జరీన్‌ను అభినందించిన సీఎం కేసీఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
న్యూఢిల్లీలో జరిగిన మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో 50 కిలోల విభాగం ఫైనల్స్‌లో బంగారు పతకం సాధించిన బాక్సర్ నిఖత్ జరీన్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అభినందించారు. వియత్నాం బాక్సర్ నుయెన్‌పై 5-0 తేడాతో విజయం సాధించి బంగారు పతకాన్ని గెలుచుకున్న జరీన్ తెలంగాణకు గర్వకారణమని ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
Also Read:Shooting At Gurudwara: అమెరికాలోని గురుద్వారాలో ఫైరింగ్ .. సిక్కుల మధ్య ముష్టియుద్ధం
జరీన్ తన వరుస విజయాలతో ప్రపంచవ్యాప్తంగా భారతదేశానికి ఉన్న ఆదరణను మరోసారి చాటిచెప్పిందని కేసీఆర్ ప్రశంసించారు. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో ఆమె కెరీర్‌లో రెండో బంగారు పతకం సాధించడం గొప్ప విశేషమని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం క్రీడల అభివృద్ధికి, క్రీడాకారులను ప్రోత్సహిస్తూ వారి సంక్షేమానికి కట్టుబడి ఉందని, ఈ దిశగా నిరంతరం కృషి చేస్తుందని పేర్కొన్నారు.
Also Read
Also Read:Uddhav Thackeray: సావర్కర్ మా దేవుడు.. రాహుల్ గాంధీకి ఉద్ధవ్ ఠాక్రే వార్నింగ్
కాగా, ఆదివారం న్యూఢిల్లీలో జరిగిన మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో జరీన్, బోర్గోహైన్ ఇద్దరూ భారత్‌కు స్వర్ణ అందించారు. 50 కేజీల విభాగంలో జరీన్ స్వర్ణం సాధించగా, 75 కేజీల విభాగంలో బోర్గోహైన్ మెటల్‌ను కైవసం చేసుకుంది. వియత్నాంకు చెందిన న్గుయెన్ థి టామ్‌తో జరిగిన ఫైనల్ బౌట్‌లో జరీన్ 5-0తో విజయం నమోదు చేసి టోర్నమెంట్‌లో భారతదేశం యొక్క మూడవ స్వర్ణాన్ని కైవసం చేసుకుంది. దీనికి ముందు 5-2 తేడాతో ఆస్ట్రేలియాకు చెందిన కైట్లిన్ పార్కర్‌తో జరిగిన శిఖరాగ్ర పోరులో లోవ్లినా బోర్గోహైన్ విజయం సాధించింది. కాగా, బాక్సింగ్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకాలు సాధించినందుకు గాను బాక్సర్లు నిఖత్ జరీన్, లోవ్లినా బోర్గోహైన్‌లను ప్రధాని నరేంద్ర మోదీ కూడా అభినందించారు.
తాజావార్తలు
-
Komatireddy Rajgopal Reddy : నేను పదవులు అడుక్కోను, నేనొక ఫైటర్‌ను
-
రూ.14,500 డిస్కౌంట్, 512GB స్టోరేజ్, Full HD+ Dynamic AMOLED 2X డిస్ప్లే శాంసంగ్ అందుబాటులోకి..
-
Shivsena: ఉద్ధవ్‌కు భారీ షాక్.. షిండే సేనలో ఎంపీల విలీనానికి స్పీకర్ ఆమోదం..
-
Kalki 2898 AD : ప్రభంజనం.. ఏకంగా రెండు జాతీయ అవార్డులు కైవసం!
-
Toxic: కియారాని వెనకేసుకొస్తున్న బ్రిటిష్ నటుడు
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్‌పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్‌కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!