NTV Telugu Site icon

టీచ‌ర్‌కు అవ‌మానం: స్టూడెంట్స్ సీరియ‌స్సైన నెటిజ‌న్లు…

మ‌న‌దేశంలో గురువును దేవుడితో స‌మానంగా పూజిస్తారు.  విద్యాబుద్దులు నేర్పించి వారి బంగారు భ‌విష్య‌త్తుకు గురువు బాట‌లు వేస్తారు.  అలాంటి గురువుల‌ను ఇప్పుడు విద్యార్థులు హెళ‌న చేస్తున్నారు.  అవ‌మానిస్తున్నారు.  క‌ర్ణాట‌క‌లోని దావ‌ణ‌గెరే జిల్లాలోని చ‌న్న‌గిరి టౌన్‌లో న‌ల్లూర్ ప్ర‌భుత్వ పాఠ‌శాల ఉన్న‌ది.  ఆ పాఠ‌శాల‌లోని త‌ర‌గ‌తి గ‌దిలోకి వ‌చ్చిన ఓ టీచ‌ర్‌కు క్లాస్‌రూమ్‌లో గుట్కా ప్యాకెట్లు క‌నిపించాయి.  విద్యార్థులు క్ర‌మ‌శిక్ష‌ణ‌ను పాటించాల‌ని చెప్పాడు.  

Read: సొంత స్పేస్ స్టేష‌న్ నిర్మాణం దిశ‌గా ఇండియా…

దీంతో ఆగ్ర‌హించిన విద్యార్థులు టీచ‌ర్‌ను దార‌ణంగా అవ‌మానించారు. చెత్త‌బుట్ట‌ను టీచ‌ర్ త‌ల‌పై బోర్లించి నానా హంగామా చేశారు.  దీనిని సంబంధించిన వీడియోను సోష‌ల్ మీడియాలో పోస్ట్ కావ‌డంతో నెటిజ‌న్లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ విష‌యం విద్యాశాఖ వ‌ర‌కు వెళ్లింది.  దీనిపై విద్యాశాఖ మంత్రి స్పందించారు.  టీచ‌ర్‌పై విద్యార్థులు దాడి చేయ‌డం స‌హించ‌రానిద‌ని అన్నారు.  దీనిపై స‌మ‌గ్ర‌ద‌ర్యాప్తుకు ఆయ‌న ఆదేశించారు.  అయితే, పిల్ల‌ల భ‌విష్య‌త్‌ను దృష్టిలో పెట్టుకొని పిల్ల‌ల‌పై ఫిర్యాదు చేయ‌కూడ‌ద‌ని టీచ‌ర్ నిర్ణ‌యించుకున్నారు.