ఈరోజు కర్ణాటకలో రెండు ఒమిక్రాన్ కేసులు బయటపడ్డాయి. రెండు కేసులు కూడా విదేశాల నుంచి వచ్చిన వారే కావడంతో దేశంలో అలజడి మొదలైంది. డెల్టా నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ప్రజానికానికి ఒమిక్రాన్ మరిన్ని ఇబ్బందులు తెచ్చిపెట్టే అవకాశం ఉంది. ఒమిక్రాన్ వేరియంట్ నేపథ్యంలో ఢిల్లీ పర్యటనలో ఉన్న కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌మాండవీయతో భేటీ అయ్యారు.
Read: డ్రాగన్ బెదిరింపులకు లొంగని లిథువేనియా… తైవాన్‌తో దోస్తీ…
దేశంలో ఒమిక్రాన్ కేసులపై, వ్యాక్సినేషన్, ఆరోగ్యకార్యకర్తలకు బూస్టర్ డోస్‌పై చర్చించారు. బూస్టర్ డోస్‌పై కమీటీ నివేదిక తరువాత నిర్ణయం తీసుకుంటామని అన్నారు. వ్యాక్సినేషన్ డ్రైవ్ విషయంలో కర్ణాటక రాష్ట్రాన్ని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి అభినందించారని, వ్యాక్సినేషన్‌ను మరింతగా పెంచాలని సూచించినట్టు ఆయన తెలిపారు.