NTV Telugu Site icon

టీఆర్ఎస్‌కు మరో షాక్..! పార్టీకి మాజీ మేయర్‌ గుడ్‌బై..

తెలంగాణలో అధికార టీఆర్ఎస్‌ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.. ఇప్పటికే సీనియర్‌ నేత గట్టు రామచంద్రరావు పార్టీకి రాజీనామా చేయగా.. తాజాగా, కరీంనగర్ మాజీ మేయర్, 51 డివిజన్ కార్పొరేటర్ సర్దార్ రవిందర్ సింగ్.. పార్టీకి గుడ్‌బై చెప్పారు… ఈ మేరకు రాజీనామా పత్రాన్ని టీఆర్ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ కు పంపించారు రవిందర్ సింగ్… టీఆర్‌ఎస్‌ పార్టీలో ఉద్యమ ద్రోహులకు అవకాశాలు ఇచ్చి.. ఉద్యమకారులను పక్కన పెడుతున్నారని లేఖలో ఆరోపించారు మాజీ మేయర్.. కాగా, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టికెట్‌ ఆశించిన రవిందర్ సింగ్‌కు నిరాశ ఎదురైంది… పార్టీ టికెట్‌ ఇవ్వకపోవడంతో.. లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో ఉన్న రవిందర్‌ సింగ్.. ఇవాళ టీఆర్ఎస్‌కు రాజీనామా చేశారు.