కనికట్టు చేసే కరీనా అందం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
(సెప్టెంబర్ 21న కరీనా కపూర్ పుట్టినరోజు)
కపూర్ ఖాన్ దాన్ లో నాల్గవ తరం తార కరీనా కపూర్. నాలుగు పదులు దాటుతున్నా, నాజూకు షోకులతో నవయువకుల గుండెల్లో గుబులు రేపుతూనే ఉంది. పటౌడీ వారి కోడలుగా మారిన తరువాత కూడా కరీనా కపూర్ తన దరికి చేరిన పాత్రల్లోకి పరకాయ ప్రవేశం చేస్తూ మురిపిస్తూనే ఉంది. ఈ నాటికీ కరీనా అందం కుర్రకారుకు బంధం వేస్తూనే ఉండడం ఆమె పతి దేవుడు సైఫ్ అలీ ఖాన్ సైతం గర్వంగా భావిస్తున్నాడు. కరీనా, సైఫ్ కాపురం సజావుగా సాగుతోంది. ఇద్దరు పిల్లల తల్లి అయిన కరీనా కపూర్ ఇప్పటికీ ఆకట్టుకుంటూ ఉండడమే విశేషం!
Also Read
- Trump-Netanyahu: అమెరికా-ఇజ్రాయెల్ ఎన్నికల ముందు ఇరాన్పై దాడి జరగనుందా? ట్రంప్-నెతన్యాహు ఏం చర్చించారు?
- Marco Rubio: మరోసారి భారత్ టూర్కు మార్కో రూబియో.. ముంబై, గుజరాత్లో పర్యటన
- UPI Charges: యూపీఐ చెల్లింపులపై కేంద్రం క్లారిటీ.. ఎప్పటి నుంచి అమల్లోకి అంటే..!
- Maharashtra: మహారాష్ట్రలో వాటర్ ఎమర్జెన్సీ.. నీళ్లు వృథా చేస్తే రూ.5 వేల జరిమానా, కేసులు!
కరీనా కపూర్ 1980 సెప్టెంబర్ 21న జన్మించింది. రాజ్ కపూర్ పెద్ద కొడుకు రణదీర్ కపూర్, నటి బబిత ఆమె కన్నవారు. తాతల నాటి నుంచీ పేరుకు పోయిన నటనతో కరీనా కపూర్ పరుగులు తీస్తూ చిత్రసీమలో అడుగు పెట్టింది. అభిషేక్ బచ్చన్ తొలి చిత్రం ‘రెఫ్యూజీ’తోనే కరీనా సైతం చిత్రసీమలో అడుగుపెట్టడం విశేషం. ఈ సినిమా ఏ మాత్రం ఆకట్టుకోలేక పోయింది. షారుఖ్ ఖాన్ చారిత్రక చిత్రం ‘అశోక’లో కీలక పాత్ర పోషించినా, ఆ సినిమా సైతం చేదురుచినే చూపించింది. కరీనా పని అయిపోయింది అనుకుంటున్న సమయంలో ‘కభీ ఖుషి కభీ ఘమ్’ ఆమె అందానికి తగ్గ విజయాన్ని అందించింది. ఆ తరువాత నుంచీ కరీనా కపూర్ కాల్ షీట్స్ కు డిమాండ్ పెరిగింది. ‘ఛమేలీ’లో వేశ్య పాత్రలో కరీనా అభినయం అందరినీ ఆకట్టుకుంది. గోవింద్ నిహలానీ ‘దేవ్’లోనూ మంచి మార్కులే సంపాదించింది. “ఓంకార, జబ్ వీ మెట్, కుర్బాన, వీ ఆర్ ఫ్యామిలీ, ఉడ్తా పంజాబ్” వంటి చిత్రాలతో నటిగా జేజేలు అందుకుంది. ఇక ఆమిర్ ఖాన్ తో నటించిన ‘3 ఇడియట్స్’, సల్మాన్ ఖాన్ సరసన అలరించిన “బాడీ గార్డ్, బజ్రంగీ భాయిజాన్” చిత్రాలు ఘనవిజయం సాధించాయి.
షాహిద్ కపూర్ హిట్ పెయిర్ గా పేరు సంపాదించింది కరీనా. వారిద్దరూ కలసి నటించిన “ఫిదా, 36 చీనా టౌన్, జబ్ వీ మెట్, చుప్ చాప్ కే” వంటి చిత్రాలలో నటించారు. కరీనా, షాహిద్ ప్రేమయాత్ర పెళ్ళి దాకా వెళ్తుందని భావించారు. అయితే అనూహ్యంగా పటౌడీ వారి అబ్బాయి సైఫ్ అలీ ఖాన్ రెండో భార్యగా కరీనా కపూర్ మారింది.
‘దేవ్’లో “జబ్ నహీ ఆయే థే తుమ్…” పాట పాడి అలరించింది కరీనా. ‘తషాన్’లోనూ గాయనిగా అలరించింది. షారుఖ్ ఖాన్ ‘డాన్’, ‘క్యా లవ్ స్టోరీ హై’, ‘రౌడీ రాథోడ్’లో “జింతాతా జితా తా…” , ‘దబంఘ్-2’లో “ఫెవికాల్…” సాంగ్స్ లో స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చి ఆకట్టుకుంది.
నటనతో పాటు రచనలోనూ కరీనా కపూర్ చేయి చేసుకుంది. ఆమె రాసిన న్యూట్రిషన్ గైడ్స్ జనాన్ని భలేగా మురిపించాయి. స్టేజ్ షోస్ తోనూ కరీనా అలరించారు. రేడియోలో ఓ కార్యక్రమానికి హోస్ట్ గానూ ఆమె వ్యవహరించారు. బాలికలకు సముచిత విద్య కోసం ‘యూనిసెఫ్’తో కలసి పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఆమిర్ ఖాన్ తో ‘లాల్ సింగ్ ఛద్దా’లో కరీనా కపూర్ నటిస్తోంది. ఆమె మరిన్ని చిత్రాలతో జనాన్ని ఆకట్టుకుంటారని ఆశిద్దాం.
తాజావార్తలు
-
Dr. B.R. Ambedkar: మరణానికి 53 రోజుల ముందు హిందుత్వాన్ని విడిచిన అంబేడ్కర్.. అసలు బౌద్ధమతాన్నే ఎందుకు స్వీకరించారు?
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..
-
Hyderabad: ఉప్పల్లో మ్యాచ్కు ముందు సంచలనం.. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సభ్యులు అరెస్ట్..!
-
21st Century Best Bowler: 21వ శతాబ్దపు టాప్-10 బౌలర్లు.. టాప్ లేపిన ఆసీస్ దిగ్గజం.. బుమ్రా స్థానం ఎక్కడో తెలుసా?
ట్రెండింగ్
-
Sound Glow ఫీచర్తో Apple HomePod Mini 2 లాంచ్.. ఫీచర్లు మాత్రం మైండ్ బ్లోయింగ్ అంతే.!
-
Rohit Sharma MI Captain: మళ్లీ ముంబై ఇండియన్స్ కెప్టెన్గా రోహిత్ శర్మ.. హింట్ ఇచ్చేసిన ఫ్రాంచైజీ!
-
12,070mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో హానర్ నుంచి పవర్ఫుల్ ఫోన్లు వచ్చేస్తున్నాయ్..!
-
Temba Bavuma: కెప్టెన్గా మొదటి ఓటమి.. ప్రపంచ రికార్డుతో చరిత్ర సృష్టించిన బవుమా..!
-
IND vs WI 4th T20I: నేడు భారత్-వెస్టిండీస్ నాలుగో టీ20.. పిచ్ రిపోర్ట్, లైవ్ స్ట్రీమింగ్, ప్లేయింగ్ 11 ఇవే!