NTV Telugu Site icon

Johnny Nellore: కేరళ కాంగ్రెస్‌కు జానీ నెల్లూరు రాజీనామా.. బీజేపీలో చేరే అవకాశం!

Johnny Nellore

Johnny Nellore

కేరళకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత జానీ నెల్లూరు బుధవారం ఆ పార్టీకి రాజీనామా చేశారు. నెల్లూరు యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యుడిఎఫ్) కార్యదర్శి పదవికి కూడా రాజీనామా చేశారు. కేరళ కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన తర్వాత, జానీ నెల్లూరు జాతీయ సెక్యులర్ పార్టీని ఏర్పాటు చేస్తానని, అది భారతీయ జనతా పార్టీ (బిజెపి) నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్‌లో చేరుతుందని చెప్పారు. అయితే, వ్యక్తిగత కారణాల వల్ల తాను రాజీనామా చేశానని, తన కొత్త పార్టీ ప్రధానంగా రైతు సమస్యలకే అంకితం అవుతుందని నాయకుడు చెప్పారు.

Also Read:BJP Praveen Kammar: బీజేపీ యువ నేత దారుణ హత్య.. అదుపులోకి నిందితులు
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేరళ పర్యటనకు ముందు జానీ నెల్లూరుకు రాజీనామా చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎకు నెల్లూరు విధేయత మారడం, అనిల్ ఆంటోని కాషాయ దళానికి చేరుకోవడంతో రాజకీయాలు ఆసక్తి రేపుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వివిధ క్రైస్తవ చర్చిల మద్దతును పొందేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నట్లు భావిస్తున్నారు. ప్రధాని మోదీ రాష్ట్రానికి రాకముందే జానీ నెల్లూరు ఎన్డీయేతో పొత్తుపై ప్రకటన చేస్తారని భావిస్తున్నారు. UDF మాజీ కార్యదర్శి వివిధ చర్చిల మద్దతుతో తన పార్టీని స్థాపించే అవకాశం ఉంది.

తాను ఎప్పుడూ రైతులకు అండగా ఉంటానని, రైతుల సమస్యలను లేవనెత్తే జాతీయ పార్టీని ఏర్పాటు చేయడమే తన లక్ష్యం అని తెలిపారు. కేరళ వ్యవసాయ రంగం కుప్పకూలిందన్నారు. రైతుల కోసం మాట్లాడే జాతీయ దృక్పథం ఉన్న పార్టీ ఆవశ్యకతతో ఆయన కొత్త పార్టీ ఆలోచన చేసినట్ల వివరించారు. అందరినీ కలుపుకొని సెక్యులర్ పార్టీని ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని కూడా చెప్పారు. క్రైస్తవ సంఘంతో చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. సీపీఐ, సీపీఎం, ఐయూఎంఎల్, కాంగ్రెస్ సభ్యులు తమ కొత్త పార్టీలో భాగమవుతారని ఆయన చెప్పారు. బీజేపీ మద్దతుతో కొత్త క్రిస్టియన్ పార్టీని స్థాపిస్తారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో జానీ నెల్లూరు ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. కేరళ కాంగ్రెస్‌కు డిప్యూటీ చైర్మన్‌గానూ, ఆ పార్టీ మాజీ చైర్మన్‌గానూ ఉన్నారు. అతను మువట్టుపుజా బార్ అసోసియేషన్‌లో న్యాయవాది కూడా. 1991, 1996, 2001లో కేరళ శాసనసభలో ఎమ్మెల్యేగా పనిచేశారు.

Also Read:Care Hospital: రోబోతో మొదటిసారిగా మోకాలి మార్పిడి శస్త్రచికిత్స విజయవంతం
కాగా, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ రక్షణ మంత్రి ఎకె ఆంటోనీ కుమారుడు అనిల్ ఆంటోనీ కొద్ది రోజుల క్రితమే బిజెపిలో చేరారు. ప్రధాని నరేంద్ర మోడీపై వివాదాస్పదమైన బిబిసి డాక్యుమెంటరీని విమర్శిస్తూ అనిల్ ఆంటోని చేసిన ట్వీట్ పార్టీలో కలకలం సృష్టించడంతో జనవరిలో ఆయన కాంగ్రెస్‌లోని అన్ని పదవులకు రాజీనామా చేశారు.

Show comments