NTV Telugu Site icon

JanaSena: రేపే జనసేన అవిర్భావ సభ.. వారాహి వాహనంలో పవన్

Pawan

Pawan

జనసేనాని పవన్ కల్యాణ్ ఏపీలో బిజీబిజీగా ఉన్నారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే బీసీ సదస్సు, కాపు సంఘాలతో సమావేశం నిర్వహించారు. రేపు మచిలీపట్నంలో జనసేన పార్టీ ఆవిర్భావ సభను ఏర్పాటు చేశారు. ఏపీలో అధికారంలో కోసం జనసేనాని వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం బీజేపీతో పొత్తులో కొనసాగుతున్న పవన్.. టీడీపీతో పొత్తు పెట్టుకోవడంపై కూడా చర్చలు జరుపుతున్నారు. ఎన్నికల నాటికి జనసేన, టీడీపీ పొత్తు ఖామం అనే ప్రచారం జరుగుతోంది. ఈసారి తెలుగుదేశం పార్టీ తో పొత్తులతో ఎన్నికలకు వెళ్లి అధికార వైసీపీని ఓడించాలని భావిస్తున్నారు. పవన్ ను సీఎం చేసి చంద్రబాబు జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాని కాపు సంఘం నేత హరిరామ జోగయ్య చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైయ్యాయి.

Also Read:Minister Seediri: విశాఖే రాజధాని నో డౌట్.. సీఎం జగన్ గొప్ప పాలసీ
ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ప్రజల్లోకి వెళ్లాని జనసేనాని నిర్ణయించారు. ఈ క్రమంలో రేపు జనసేన పార్టీ పదవ ఆవిర్భావ సభను భారీగా నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో ఈసారి ఎలాగైనా ఎన్నికలలో తమ సత్తా చాటాలని భావిస్తున్న పవన్ కళ్యాణ్ ఇప్పటినుంచే ప్రజల బలం పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. మచిలీ పట్నం సభ ద్వారా పవన్ ఎన్నికల శంఖారావం పూరిస్తారని ప్రచారం జరుగుతోంది. వచ్చే ఎన్నికలకు దిశా నిర్దేశం చేస్తారని జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలు భావిస్తున్నారు. గతంలో ఇప్పటం సభకు ఇచ్చినట్టే 100 ఎకరాల భూమిని సభ నిర్వహణ కోసం మచిలీపట్నం రైతులు ఇచ్చారు. సభ విజయవంతానికి పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని జనసేనాని కోరారు.
Also Read:5G Smart Phone: మోటరోలా నుంచి స్మార్ట్ ఫోన్.. ధర ఎంతంటే..

జనసేన ఆవిర్భావ సభ కోసం పవన్ కళ్యాణ్ తాను ఎన్నికల ప్రచారానికి సిద్ధం చేసుకున్న ప్రచార రథం వారాహి వాహనంలో మచిలీపట్నానికి వెళ్లనున్నారు. పవన్ కల్యాణ్ పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి పేర్ని నాని ఇలాకాలో జనసేన సభ జరుగుతుండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Also Read:Naatu Naatu: ‘నాటు నాటు’కు ఆస్కార్.. కేసీఆర్‌ హర్షం..
మరోవైపు ఇప్పటికే రాష్ట్రంలో జనసేన క్రియాశీలక సభ్యత్వాల నమోదు ప్రక్రియ కొనసాగింది. జనసేన పార్టీలో ప్రజలు క్రియాశీల సభ్యత్వాలను తీసుకున్నారు. సభకు తరలివచ్చే శ్రేణులు, నాయకులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడడానికి మొత్తం 10 కమిటీలను వేసి ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణ నుంచి కూడా పెద్ద ఎత్తున జనసేన పార్టీ నాయకులు సభకు తరలి వెళ్లనున్నారని తెలుస్తోంది.