Jansena: నేడు జనసేన ఆవిర్భావ సభ… ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్న పవన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జనసేన పార్టీ పదో వార్షిక ఆవిర్భావ సభ ఈ రోజు కృష్ణా జిల్లా మచిలీపట్నంలో నిర్వహిస్తున్నారు. సభకు పవన్ తన ప్రచార రథం వారాహిలో రానున్నారు. ఈ సభ ద్వారా కార్యకర్తలకు ఎన్నికలకు సంబంధించి దిశానిర్దేశం చేయనున్నట్టు తెలుస్తుంది. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ పవన్ కళ్యాణ్ ప్రజల్లో ఉండాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో జనసేన ఆవిర్భావ సభ ద్వారా ఎన్నికల శంఖారావాన్ని పూరించాలని జనసేనాని పవన్ భావిస్తున్నట్టు సమాచారం.
Also Read:Off The Record: ఎమ్మెల్యేలు లేకున్నా.. ఏంటీ ధీమా?
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
- Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
- RBI: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
సభలో భారీగా జనసైనికులు పాల్గొననున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్దఎత్తున కార్యకర్తలు రానున్నట్లు పార్టీ నేతలు తెలిపారు. బందరులో 35 ఎకరాల్లో పొట్టి శ్రీరాములు పేరుతో సభా ప్రాంగణం, 65 ఎకరాల్లో పార్కింగ్ కోసం ఏర్పాట్లు చేశారు. సంబంధిత రైతుల నుంచి అనుమతులు తీసుకున్నారు. ఎల్‌ఈడీ స్క్రీన్‌లతో పది గ్యాలరీలు సిద్ధం చేశారు. పార్కింగ్ ప్రాంతంలోనే భోజన వసతి కల్పిస్తున్నారు. తాగునీరు, మజ్జిగ, పండ్లు అందించేందుకు కమిటీలను నియమించారు. వైద్య బృందాలు, 8 అంబులెన్స్‌లు సిద్ధంగా ఉంచారు. పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ మధ్యాహ్నం వారాహి వాహనంలో విజయవాడ ఆటోనగర్ నుంచి మచిలీపట్నం బయలు దేరుతారు. సాయంత్రం 5గంటలకు సభా ప్రాంగణానికి చేరుకుంటారు. రాత్రి 9 గంటల వరకు సభ జరుగనుంది. పవన్‌కు విజయవాడ-బందరు మధ్య దారి పొడవునా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
Also Read:Rapper Costa Titch: పాట పాడుతూ.. వేదికపైనే కుప్పకూలిన ర్యాపర్
రా ష్ట్రంలో ఎన్నికలకు ఏడాదే మిగిలి ఉన్నందున పవన్‌కల్యాణ్ తన రాజకీయ పయనానికి సంబంధించి ఎలాంటి కీలక ప్రకటనలు చేయనున్నారనే దానిపై ప్రధానంగా ఆసక్తి నెలకొంది. వైసీపీ ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచిన పవన్.. ఈ సభ ద్వారా తన భవిష్యత్తు రాజకీయ ప్రణాళికలను, కార్యాచరణను ప్రకటించే అవకాశ ఉంది.
మరోవైపు కృష్ణా జిల్లావ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది పోలీసులు తెలిపారు. జాతీయ రహదారిపై ప్రదర్శనలు, సభలు నిర్వహించుకునేందుకు అనుమతులు లేవని స్పష్టం చేశారు. జనసేన పార్టీ ఆవిర్భావ సభ సందర్భంగా పోలీసులు ఆంక్షలు విధించడంపై జనసేన నేతలు మండిపడుతున్నారు.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!