NTV Telugu Site icon

Jansena: నేడు జనసేన ఆవిర్భావ సభ… ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్న పవన్

Pawan Janasena

Pawan Janasena

జనసేన పార్టీ పదో వార్షిక ఆవిర్భావ సభ ఈ రోజు కృష్ణా జిల్లా మచిలీపట్నంలో నిర్వహిస్తున్నారు. సభకు పవన్ తన ప్రచార రథం వారాహిలో రానున్నారు. ఈ సభ ద్వారా కార్యకర్తలకు ఎన్నికలకు సంబంధించి దిశానిర్దేశం చేయనున్నట్టు తెలుస్తుంది. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ పవన్ కళ్యాణ్ ప్రజల్లో ఉండాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో జనసేన ఆవిర్భావ సభ ద్వారా ఎన్నికల శంఖారావాన్ని పూరించాలని జనసేనాని పవన్ భావిస్తున్నట్టు సమాచారం.

Also Read:Off The Record: ఎమ్మెల్యేలు లేకున్నా.. ఏంటీ ధీమా?

సభలో భారీగా జనసైనికులు పాల్గొననున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్దఎత్తున కార్యకర్తలు రానున్నట్లు పార్టీ నేతలు తెలిపారు. బందరులో 35 ఎకరాల్లో పొట్టి శ్రీరాములు పేరుతో సభా ప్రాంగణం, 65 ఎకరాల్లో పార్కింగ్‌ కోసం ఏర్పాట్లు చేశారు. సంబంధిత రైతుల నుంచి అనుమతులు తీసుకున్నారు. ఎల్‌ఈడీ స్క్రీన్‌లతో పది గ్యాలరీలు సిద్ధం చేశారు. పార్కింగ్‌ ప్రాంతంలోనే భోజన వసతి కల్పిస్తున్నారు. తాగునీరు, మజ్జిగ, పండ్లు అందించేందుకు కమిటీలను నియమించారు. వైద్య బృందాలు, 8 అంబులెన్స్‌లు సిద్ధంగా ఉంచారు. పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ మధ్యాహ్నం వారాహి వాహనంలో విజయవాడ ఆటోనగర్‌ నుంచి మచిలీపట్నం బయలు దేరుతారు. సాయంత్రం 5గంటలకు సభా ప్రాంగణానికి చేరుకుంటారు. రాత్రి 9 గంటల వరకు సభ జరుగనుంది. పవన్‌కు విజయవాడ-బందరు మధ్య దారి పొడవునా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Also Read:Rapper Costa Titch: పాట పాడుతూ.. వేదికపైనే కుప్పకూలిన ర్యాపర్

రా ష్ట్రంలో ఎన్నికలకు ఏడాదే మిగిలి ఉన్నందున పవన్‌కల్యాణ్‌ తన రాజకీయ పయనానికి సంబంధించి ఎలాంటి కీలక ప్రకటనలు చేయనున్నారనే దానిపై ప్రధానంగా ఆసక్తి నెలకొంది. వైసీపీ ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచిన పవన్.. ఈ సభ ద్వారా తన భవిష్యత్తు రాజకీయ ప్రణాళికలను, కార్యాచరణను ప్రకటించే అవకాశ ఉంది.

మరోవైపు కృష్ణా జిల్లావ్యాప్తంగా 30 పోలీస్‌ యాక్ట్‌ అమల్లో ఉంది పోలీసులు తెలిపారు. జాతీయ రహదారిపై ప్రదర్శనలు, సభలు నిర్వహించుకునేందుకు అనుమతులు లేవని స్పష్టం చేశారు. జనసేన పార్టీ ఆవిర్భావ సభ సందర్భంగా పోలీసులు ఆంక్షలు విధించడంపై జనసేన నేతలు మండిపడుతున్నారు.