Site icon NTV Telugu

Jagga Reddy: రాహుల్‌ గాంధీతో జగ్గారెడ్డి భేటీ.. ఇక సమస్యలే లేవు..!

Jagga Reddy Family

Jagga Reddy Family

పీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి పగ్గాలు చేపట్టిన తర్వాత బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తూ వచ్చిన ఎమ్మెల్యే జగ్గారెడ్డి… ఓ దశలో రాజీనామాకు సిద్ధపడ్డారు.. సోనియా, రాహుల్‌ గాంధీకి లేఖ రాసి.. ఇక, నేను కాంగ్రెస్‌ గుంపులో లేనట్టే అని పేర్కొన్నారు.. ఎంతమంది సముదాయించినా వెనుకడుగు వేసినట్టు కనిపించలేదు.. కానీ, రాహుల్‌ గాంధీతో రాష్ట్ర కాంగ్రెస్‌ ముఖ్యనేతల సమావేశం తర్వాత మనసు మార్చుకుని రాజీనామా లేఖను ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించారు. ఇవాళ కుటుంబ సమేతంగా రాహుల్‌ గాంధీని కలిసిన ఆయన.. ఇకపై బహిరంగ విమర్శలు ఉండవు.. మీరు కూడా చూడరు అని వెల్లడించారు.. పార్టీలో ఇప్పుడు సమస్యలే లేవని పేర్కొన్నారు జగ్గారెడ్డి.. నా కుటుంబ సభ్యులతో కలిసి రాహుల్ గాంధీని కలవాలని ఎప్పటినుంచో అనుకున్నాను.. అది ఈరోజు కుదిరిందన్నారు. రాజకీయాల కంటే ముందు మా పిల్లల చదువుల గురించి అడిగారని తెలిపారు.

Read Also: Omicron new variant: భారత్‌లో కొత్త వేరియంట్‌ కలకలం.. ముంబైలో తొలి కేసు..

బీజేపీ, ఎంఐఎం పార్టీలు మత విద్వేషాలతో రాజకీయం చేస్తున్నా.. టీఆర్‌ఎస్‌ పార్టీతో పాటు మొత్తం ఈ మూడు పార్టీలకు వ్యతిరేకంగా పనిచేస్తామని వెల్లడించారు జగ్గారెడ్డి.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేలా కలసికట్టుగా పనిచేసి, ప్రజా సమస్యలపై పోరాటం సాగిస్తామన్న ఆయన.. సోనియా, రాహుల్ గాంధీ నాయకత్వంలో ముందుకు వెళ్తామన్నారు. ఇక, రాహుల్ గాంధీ ముందు ఏ అంశాన్ని ఎత్తలేదు.. ఇప్పటి వరకు జరిగిన అన్నీ మర్చిపోయాను అని స్పష్టం చేశారు.. మొన్నటి సమావేశంలో ఇచ్చిన సందేశం మేరకు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడమే లక్ష్యంగా ముందుకెళ్తామన్నారు.. మనం, మన కుటుంబం అంటే.. ప్రజలు, దేశం అన్నట్టుగా మేమంతా కలసికట్టుగా పనిచేస్తామని.. బహిరంగ విమర్శలు ఇకపై ఉండవు.. మీరు కూడా చూడరు.. అసలు పార్టీలో ఇప్పుడు సమస్యలే లేవన్నారు జగ్గారెడ్డి. మరోవైపు, కేసీ వేణుగోపాల్, మాణిక్యం ఠాగూర్‌తో కూడా పార్టీ అంశాల గురించి చర్చించినట్టు తెలిపారు ఎమ్మెల్యే జగ్గారెడ్డి.

Exit mobile version