పీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి పగ్గాలు చేపట్టిన తర్వాత బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తూ వచ్చిన ఎమ్మెల్యే జగ్గారెడ్డి… ఓ దశలో రాజీనామాకు సిద్ధపడ్డారు.. సోనియా, రాహుల్ గాంధీకి లేఖ రాసి.. ఇక, నేను కాంగ్రెస్ గుంపులో లేనట్టే అని పేర్కొన్నారు.. ఎంతమంది సముదాయించినా వెనుకడుగు వేసినట్టు కనిపించలేదు.. కానీ, రాహుల్ గాంధీతో రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్యనేతల సమావేశం తర్వాత మనసు మార్చుకుని రాజీనామా లేఖను ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించారు. ఇవాళ కుటుంబ సమేతంగా రాహుల్ గాంధీని కలిసిన ఆయన.. ఇకపై…