ఏపీ ప్రభుత్వం ఇటీవల వన్ టైం సెటిల్‌మెంట్ (ఓటీఎస్) పథకాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ ఓటీఎస్‌పై టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ శ్రేణులు నిరసనలు చేస్తున్నాయి. అయితే తాజాగా పశ్చిమగోదావరి జిల్లాలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆధ్వర్యంలో టీడీపీ నేతలు ఓటీఆఎస్‌ను రద్దు చేయాలంటూ కలేక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా చింతమనేని మాట్లాడుతూ.. అన్ని వర్గాల వారిని జగన్ దోపిడీ చేస్తున్నాడని ఆయన అన్నారు. అంతేకాకుండా ఇది ఓటీఎస్ సెటిలెంట్ కాదు… ఓజేడీ( ఒక్కసారి జగన్ మోహన్ రెడ్డి దోపిడీ) అంటూ ఎద్దేవా చేశారు. పేదవారికి హక్కు కల్పిస్తున్నాం త్వరగా ఇల్లు అమ్మేసి తాగి నెత్తిన పోసుకోండి అనేలా జగన్ విధానం ఉంది. అధికారంలోకి రాగానే టీడీపీ నయాపైసా ఖర్చు లేకుండా లబ్దిదారులకు హక్కు కల్పిస్తుంది. లబ్దిదారులు అధికారులకు, వాలంటీర్లకు ఎవరికి లొంగద్దు అంటూ ఆయన వ్యాఖ్యానించారు.
