NTV Telugu Site icon

ఫ్లాష్..ఫ్లాష్.. మూడు రాజధానుల చట్టాన్ని ఉపసంహరించుకున్న జగన్‌ సర్కార్‌

అమరావతి రైతులు, ఏపీకి ఒకే రాజధానికి మద్దతిస్తున్న వారికి జగన్‌ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. మూడు రాజధానులపై జగన్‌ సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ ప్రభుత్వం మూడు రాజధానుల చట్టాన్ని ఉప సంహరించుకున్నట్లు అడ్వకేట్‌ జనరల్‌ ప్రకటించారు. ఈ నేపథ్యంలో మూడు రాజధానుల చట్టాన్ని ఉపసంహరించుకుంటామని హైకోర్టుకు అడ్వకేట్‌ జనరల్‌ వెల్లడించారు.

Also Read : కొండపల్లి మున్సిపాలిటీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత

వికేంద్రీకరణ బిల్లు, సీఆర్‌డీఏ రద్దు బిల్లులను కేబినెట్‌ రద్దు చేసినట్లు అడ్వకేట్‌ జనరల్‌ స్పష్టం చేశారు. చట్టం రద్దుపై కాసేపట్లో అసెంబ్లీలో సీఎం ప్రకటన చేస్తారని ఆయన వెల్లడించారు.దీంతో అమరావతి రైతులు, మద్దతుదారులు సంబరాలు చేసుకుంటున్నారు. ఏపీలో మూడు రాజధానులు చేస్తామంటూ జగన్‌ ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ ప్రకటనను సవాల్‌ చేస్తూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు అవడంతో దీనిపై హైకోర్టు విచారణ చేపట్టింది. హైకోర్టు విచారణలో నేడు మూడు రాజధానుల చట్టాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రభుత్వం తరుపున అడ్వకేట్‌ జనరల్‌ వెల్లడించారు.