Site icon NTV Telugu

అనపర్తిలో వైరల్ అవుతున్న జగన్ ఫ్లెక్సీలు

తూర్పుగోదావరి జిల్లాలో జగన్ ఫ్లెక్సీలు వైరల్ అవుతున్నాయి. అనపర్తి కెనాల్ రోడ్ మరమ్మత్తులు చెయ్యాలంటూ గుర్తుతెలియని వ్యక్తులు వివాదాస్పద ప్లెక్సీలు ఏర్పాటుచేశారు. జగన్ అన్న ఉన్నాడు జాగ్రత్త అంటూ గోతుల వద్ద ప్లెక్సీలు ఏర్పాటు చేయడం హాట్ టాపిక్ అవుతోంది. అనపర్తి – బలభద్రపురం మధ్య పలుచోట్ల సీఎం జగన్ ఫోటోలతో ఉన్న ప్లెక్సీలు దర్శనం ఇచ్చాయి.

ఈ ఫ్లెక్సీలు వివాదాస్పదంగా ఉండటంతో రోడ్డుపై వున్న ప్లెక్సీలను తొలగించారు అనపర్తి పోలీసులు. స్వాధీనం చేసుకున్న ప్లెక్సీలను వాహనంలో పోలీస్ స్టేషన్ కు తరలించారు. తెల్లవారుజాము సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ప్లెక్సీలు ఏర్పాటు చేసినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. ఫ్లెక్సీల గురించిన సమాచారం తెలపాలని పోలీసులు కోరారు. అనపర్తి శివారు రోడ్ల దుస్థితి పై ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలపై సెటైర్లు పడుతున్నాయి.

Exit mobile version