ఫొటో ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అందుకే ఫొటోలు దిగేందుకు ఆసక్తి చూపుతుంటారు. ఇక ఫొటోగ్రాఫర్లు ఆరుదైన ఫొటోలు తీసేందుకు తాపత్రయపడుతుంటారు. ఆరుదైన ఫొటోల కోసం ఎన్ని రోజులైనా నిరీక్షించి ఒపిగ్గా ఫొటోలు తీస్తుంటారు. అలాంటి వాటిల్లో ఈ ఫొటో కూడా చేరిపోయింది. 300 మంది మగ, ఆడ వాలంటీర్లను నగ్నంగా నిలబెడ్డి ఫొటో తీశాడు. ఈ ఫొటోలో ఎక్కడా కూడా అసభ్యత కనిపించదు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఇలా ఈ ఫొటోను తీయడం వెనుక చాలా కథ ఉన్నది. ఈ అరుదైన ఫొటోకు ఇజ్రాయిల్‌లోని అరబ్ నగరం వేదికగా మారింది. అరబ్ నగరంలోని డెడ్‌సీ వద్ద ఈ ఫొటోను తీశాడు అమెరికన్ ఫొటోగ్రాఫర్ స్పెన్సర్ టునిక్.
Read: అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం… ఐదుగురి మృతి…
ఇజ్రాయిల్‌లో ఉప్పనీటి వనరులు క్షీణించిపోతున్నాయని, దీంతో వ్యవసాయం కోసం భూఉపరితల నీటీ వనరులపై ఆధారపడాల్సి వస్తోందని, అంతే కాకుండా కరోనా కారణంగా పర్యాటకుల సంఖ్య తగ్గిపోయింది. దీంతో ఇజ్రాయిల్ ప్రభుత్వం వినూత్నంగా ఆలోచించి ఫొటోగ్రాఫర్ స్పెన్సర్‌తో ఈ విధమైన ఫొటోను తీయించింది. ఈ కళాత్మక నగ్నపొటో తరువాత విదేశీ పర్యాటకులు ఇజ్రాయిల్‌ను తప్పకుండా సందర్శిస్తారని ప్రభుత్వం ఆలోచన. కరోనా మహమ్మరి నుంచి కోలుకుంటుండటంతో పర్యాటకులను ఇజ్రాయిల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.