Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Is Rahul Gandhi Mark Politics Started In Congress

కాంగ్రెస్ లో రాహుల్ ‘మార్క్’ రాజకీయం షూరు…?

Published Date :October 8, 2021 , 7:30 pm
By Manohar
కాంగ్రెస్ లో రాహుల్ ‘మార్క్’ రాజకీయం షూరు…?
  • Follow Us :
  • google news
  • dailyhunt

కాంగ్రెస్ పార్టీ అంటే గాంధీలు.. గాంధీలంటే కాంగ్రెస్ పార్టీ గుర్తుకొస్తుంది. ఈ రెండింటి మధ్య అవినాభావ సంబంధం ఉంది. గాంధీ కుటుంబం నుంచి కాంగ్రెస్ చేజారిపోతే ఆపార్టీ బ్రతికి బట్టకట్టదనే ప్రచారం ఉంది. ఈ కారణంతోనే సోనియాగాంధీ ఎంత కష్టమైనా అధ్యక్ష బాధ్యతలను తానే మోస్తున్నారు. ఒక్కసారి అధ్యక్ష పీఠం చేజారితే ఏం జరుగుతుందో సోనియాగాంధీకి తెలుసు. అందుకే ఆమె అధ్యక్ష బాధ్యతలను ఇతరులకు కట్టబెట్టేందుకు సుముఖతను వ్యక్తం చేయడం లేదు. ఇస్తేగిస్తే గాంధీ కుటుంబంలోని వారికేనని ఆమె ఖరాకండిగా చెప్పేస్తున్నారు.  

యూపీఏ సర్కారు హయాంలో సోనియాగాంధీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉన్నారు. కొద్దినెలల క్రితం అనారోగ్య కారణాలతో ఆమె తప్పుకోగా రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్ష పదవీని చేపట్టారు. అయితే అప్పుడు జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ దారుణంగా ఓటమి పాలైంది. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్ష పదవీకి రాజీనామా చేశారు. అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీకి శాశ్వత అధ్యక్షుడు లేకుండా పోయాడు. ప్రస్తుతం సోనియాగాంధీనే కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగుతూ పార్టీని చక్కబెడుతున్నారు. 

సోనియాగాంధీ సీనియర్ల సలహాలను, సూచనలు పాటిస్తూ ముందుకెళుతుంటారు. రాహుల్ మాత్రం ఇందుకు భిన్నంగా ఉంటారు. దీంతో రాహుల్ అధ్యక్ష పదవీ ఉన్నప్పుడు సీనియర్లకు ఆయనకు పెద్దగా పడేది కాదనే ప్రచారం ఉంది. తన నిర్ణయాలు అమలు కాకుండా సీనియర్లు అడ్డుపడుతుంటంతో రాహుల్ తన అధ్యక్ష పదవీకి రాజీనామా చేసినట్లు మరోవాదన ఉంది. ఇక రాహుల్ అధ్యక్ష పదవీ నుంచి తప్పుకున్నాక సోనియాగాంధీ పార్టీలో ఆయన నిర్ణయాలనే అమలు చేస్తున్నారని సీనియర్లు భావిస్తున్నారు. 

రాహుల్ అధ్యక్ష పదవీ చేపట్టకుండా పార్టీలో సొంత నిర్ణయాలు అమలు చేస్తున్నారంటూ సీనియర్ల గుస్సా అవుతున్నారు. ఈక్రమంలోనే 23మంది సీనియర్లు అధినాయకత్వాన్ని ధిక్కరిస్తూ లేఖాస్త్రాన్ని సంధించారు. అప్పట్లో ఈ అంశం కాంగ్రెస్ లో పెను సంచలనంగా మారింది. అయితే సోనియాగాంధీ సీనియర్లకు నచ్చజెప్పడంతో పరిస్థితి తిరిగి సర్దుమణిగింది. ఈక్రమంలోనే రాహుల్, ప్రియాంక గాంధీలు సీనియర్లకు పొమ్మనలేక పొగబెడుతున్నారు. అదే సమయంలో తనకంటూ ఓ టీమును రెడీ చేసుకుంటున్నారు.  

త్వరలో జరుగబోయే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సాక్షిగా కాంగ్రెస్ పార్టీ సీనియర్లను పక్కన పెడుతోంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో వీరి సేవలను ఉపయోగించుకోకూడదని పార్టీ భావిస్తుందట. ఇదే సమయంలో రాహుల్, ప్రియాంక సన్నితులు, కొందరు జాతీయ స్థాయి నేతలను ఆయా రాష్ట్రాలకు పంపించి ప్రచారం చేయనున్నారు. రాహుల్, ప్రియాంక అనుచరులకు పెద్దపీఠ వేయడం ద్వారా సీనియర్లకు పార్టీలో చెక్ పెట్టనున్నట్లు తెలుస్తోంది. 

మొత్తానికి త్వరలో జరుగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో రాహుల్, ప్రియాంక మార్క్ స్పష్టంగా కన్పించనుంది. ఈ ఎన్నికల రిజల్ట్ తర్వాత రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు చేపడుతారనే ప్రచారం కాంగ్రెస్ లో జోరుగా సాగుతోంది. ఈలోగా రాహుల్, ప్రియాంక గాంధీలు తమకంటూ ఓ టీమును సెట్ చేసుకునే పనిలో పడ్డారని సమాచారం. ఈ టీముతోనే వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు రాహుల్ గాంధీ వెళుతారనే టాక్ విన్పిస్తుంది. మరీ రాహుల్ నిర్ణయంపై సీనియర్లు ఎలా రియాక్ట్ అవుతారో అనేది ఆసక్తికరంగా మారింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • congress
  • Congress Party
  • rahul gandhi
  • sonia gandhi

తాజావార్తలు

  • Iran Warning: భూతల దాడులు చేస్తే… అమెరికాకు అదే గతి.. ఇరాన్ పత్రిక వార్నింగ్

  • Viral Video: సీఎం బుగ్గపై ముద్దు పెట్టిన మహిళ.. నెట్టింట వీడియో వైరల్..

  • Story Board : ఇరాన్ ఉచ్చులో ట్రంప్..! యుద్ధం మొదలుపెట్టి.. ఎగ్జిట్ దొరకక అమెరికా అయోమయం

  • Growth Risks: భారత ఆర్థిక వృద్ధికి పొంచి ఉన్న ముప్పు.. భారీగా తగ్గిన అంచనాలు..

  • Trump: ‘నా కాళ్లకు నమస్కరిస్తాడని అనుకోలేదు’.. సౌదీ యువరాజుపై బాంబ్ పేల్చిన ట్రంప్

ట్రెండింగ్‌

  • Kitchen Tips : వేసవిలో పాలు త్వరగా పాడవుతున్నాయా..? అయితే ఈ సింపుల్ ట్రిక్ మిస్ కాకండి.!

  • కొత్త ఫీచర్లు, మెరుగైన 25కి పైగా అప్డేట్స్‌తో Hyundai Exter Facelift లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే..!

  • Jowar Dibbrotte Recipe: పైకి కరకరలాడుతూ, లోపల మెత్తగా ఉండే.. ఆరోగ్యకరమైన ‘జొన్న దిబ్బరొట్టె’ చేసేయండి ఇలా..!

  • స్పోర్టీ లుక్+బెటర్ గ్రిప్.. స్పోర్టీ రైడింగ్ కోసం కొత్త 2026 Royal Enfield Guerrilla 450 Apex వచ్చేసింది.. ధర ఎంతంటే.?

  • Hiccups Remedies : వెక్కిళ్లు ఆగడం లేదా.? ఈ చిట్కాలతో 30 సెకన్లలో చెక్ పెట్టండి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions