NTV Telugu Site icon

Diplomatic Ties: ఇరాన్, సౌదీ అరేబియా దౌత్య సంబంధాలు.. చైనా మధ్యవర్తిత్వంతో ఒప్పందం

Iran China

Iran China

ఇరాన్, సౌదీ అరేబియా రెండు దేశాల మధ్య కొన్నేళ్లుగా ఉద్రిక్తతల తర్వాత దౌత్య సంబంధాలను పునరుద్ధరించడానికి చర్యలు పునఃప్రారంభమయ్యాయి. రెండు నెలల్లో రాయబార కార్యాలయాలను తిరిగి తెరవడానికి అంగీకరించాయి. చైనా మధ్యవర్తిత్వంతో బీజింగ్‌లో సయోధ్య కుదిరింది. చైనా మధ్యవర్తిత్వ చర్చలలో దౌత్య కార్యకలాపాలను తిరిగి తెరవడానికి శుక్రవారం అంగీకరించాయి. సౌదీ అరేబియా ప్రతినిధి బృందానికి జాతీయ భద్రతా సలహాదారు అయిన ముసాద్ బిన్ మొహమ్మద్ అల్-ఐబాన్ నాయకత్వం వహించారు. ఇరాన్ ప్రతినిధి బృందానికి దేశ అత్యున్నత జాతీయ భద్రతా మండలి కార్యదర్శి అడ్మిరల్ అలీ శంఖానీ నేతృత్వం వహించారు.

Also Read: Liquor Scam: నేడు ఈడీ ముందుకు ఎమ్మెల్సీ కవిత.. విచారణపై ఉత్కంఠ

2016లో ఇస్లామిక్ రిపబ్లిక్‌లోని సౌదీ దౌత్య కార్యాలయాలపై ఇరాన్ నిరసనకారులు దాడి చేసిన తర్వాత రియాద్ టెహ్రాన్‌తో సంబంధాలను తెంచుకుంది. షియా-మెజారిటీ ఇరాన్, సున్నీ ముస్లిం సౌదీ అరేబియా మధ్యప్రాచ్యం అంతటా అనేక సంఘర్షణ ప్రాంతాలలో ప్రత్యర్థి పక్షాలకు మద్దతు ఇస్తున్నాయి. యెమెన్‌తో సహా హుతీ తిరుగుబాటుదారులు టెహ్రాన్‌కు మద్దతు ఇస్తున్నారు. ప్రభుత్వానికి మద్దతు ఇచ్చే సైనిక కూటమికి రియాద్ నాయకత్వం వహిస్తుంది. రెండు దేశాలకు పొరుగున ఉన్న ఇరాక్ ఏప్రిల్ 2021 నుండి ఇరాన్ , సౌదీ అరేబియా మధ్య అనేక రౌండ్ల చర్చలను నిర్వహించింది.

Show comments