గత రెండేళ్లుగా కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. తగ్గినట్టే తగ్గి మరలా విరుచుకుపడుతున్నది. కరోనాకు భయపడి చాలా దేశాలు సరిహద్దులను మూసివేశాయి. విమాన సర్వీసులు నిలిపివేశాయి. జాతీయంగా షరతులతో కూడిన విమానాలను కొంతకాలం పాటు నడిపారు. రష్యాతో పాటుగా కొన్ని దేశాల్లో కరోనా ఇంకా విజృంభిస్తూనే ఉన్నది. మొన్నటి వరకు ఆస్ట్రేలియాలోని కొన్ని దేశాల్లో కరోనా మహమ్మారి ఇబ్బంది పెట్టింది. 18 నెలలుగా అంతర్జాతీయ సర్వీసులను రద్దు చేసిన ఆస్ట్రేలియా ప్రస్తుతం తిరిగి పునరుద్దరించింది. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నవారికి ఎలాంటి క్వారంటైన్ నింబంధనలు విధించడంలేదని ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రకటించింది. 18 నెలల తరువాత అంతర్జాతీయ విమానాలు సిడ్నీలో ల్యాండ్ అయ్యాయి. ఆప్తులు, టూరిస్టులను రిసీవ్ చేసుకోవడానికి పెద్ద ఎత్తున ప్రజలు సిడ్నీ ఎయిర్‌పోర్ట్‌కు వచ్చారు. చాలా కాలం తరువాత ఆప్తులను కలుసుకోవడంతో ఆనందంతో కన్నీరు పెట్టుకున్నారు. సిడ్నీ ఎయిర్‌పోర్ట్‌లో ఎటు చూసినా ఇలాంటి దృశ్యాలే కనిపిస్తున్నాయి.
18 నెలల తరువాత ల్యాండైన విమానాలు… కన్నీటి పర్యంతమైన టూరిస్టులు…
