అందరికీ సమాన హక్కులు, మహిళ సాధికారత సాధించినపుడే దేశం అభివృద్ది చెందుతుంది. మనదేశంలో పెళ్లిళ్ల కోసం పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చు చేస్తుంటారు. భారీగా డబ్బులు వెచ్చిస్తుంటారు. కట్నం కింద కోట్ల రూపాయలు ఇస్తుంటారు. రాజస్థాన్‌కు చెందిన ఓ జంటకు ఇటీవలే పెళ్లి జరిగింది. పెళ్లి కట్నం కింద ఇచ్చే డబ్బులు తమకు వద్దని, ఆ డబ్బుతో బాలికల కోసం హస్టల్ కట్టించాలని కోరారు. నూతన దంపతుల కోరిన కోరికను తీర్చేందుకు ఆ కుటుంబం సిద్ధమయింది.
Read: కోవిడ్‌కు మరో కొత్త ఔషధం…
రూ.75 లక్షలు కట్నం కింద ఇవ్వాలని ముందుగా నిర్ణయించుకున్నా, దంపతుల కోరిక మేరకు హాస్టల్ కోసం కోటి రూపాయలు వెచ్చించేందుకు సిద్ధమయ్యారు కుటుంబసభ్యులు. అవసరమైతే మరో రూ.50 నుంచి రూ. 75 లక్షల రూపాయలను అదనంగా వెచ్చిందుకు సిద్ధంగా ఉన్నామని దంపతుల కుటుంబసభ్యులు తెలిపారు. దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.