కోవిడ్‌కు మ‌రో కొత్త ఔష‌ధం…

క‌రోనా మ‌హ‌మ్మారికి చెక్ పెట్టేందుకు ఇప్ప‌టికే అనేక ఔష‌ధాలు అందుబాటులోకి వ‌చ్చాయి.  వ్యాక్సిన్ రూపంలో వీటిని అందిస్తున్నారు.  ఇండియాలో సీరం కోవీషీల్డ్‌, భార‌త్ బ‌యోటెక్ కోవాగ్జిన్‌, జైడ‌స్ క్యాడిలా జైకొవ్ డీ అందుబాటులో ఉన్నాయి.  ఇవే కాకుండా ఇతర దేశాల‌కు చెందిన వ్యాక్సిన్లు కూడా ఇండియాలో అందుబాటులోకి వ‌చ్చాయి.  అయితే, చాలా మంది వ్యాక్సిన్‌ను ఇంజెక్ష‌న్ రూపంలో తీసుకోవ‌డానికి ఇష్ట‌ప‌డ‌రు.  దీంతో ప్ర‌త్నామ్నాయంగా మ‌రికొన్ని ప‌ద్ధ‌తుల్లో వ్యాక్సిన్ త‌యారు చేయ‌డానికి శాస్త్ర‌వేత్త‌లు ప‌రిశోధ‌న‌లు చేస్తున్నారు.

Read: మ‌ళ్లీ పంజాబ్‌లో లొల్లి… నిరాహార దీక్ష చేస్తానంటున్న సిద్దూ…

ప్ర‌ముఖ టొబాకో సంస్థ ఐటీసీ క‌రోనా ఔష‌ధంపై దృష్టి సారించింది.  ఐటీసీ లైఫ్ సైన్సెస్ అండ్ టెక్నాల‌జీస్ సెంట‌ర్ క‌రోనా ఔష‌ధాన్ని త‌యారు చేసే ప‌నిలో ఉన్న‌ది.  ముక్కుల్లో వేసే ఔషధంగా దీన్ని త‌యారు చేస్తున్నారు.  ప్ర‌స్తుతం ట్ర‌య‌ల్స్ ద‌శ‌లో ఉన్న‌ట్టు ఐటీసీ అధికారులు చెబుతున్నారు.  ట్ర‌య‌ల్స్ పూర్త‌య్యి అన్నిర‌కాల అనుమ‌తులు వ‌స్తే త‌మ కంపెనీ ఉత్ప‌త్తి అయిన శావ్‌లాన్ బ్రాండ్ కింద నాజ‌ల్ స్ప్రేని మార్కెట్‌లోని విడుద‌ల చేస్తామ‌ని చెబుతున్నారు.  ప్ర‌స్తుతం ట్ర‌య‌ల్స్ లో ఉండ‌టం వ‌ల‌న ఇంత‌కంటే ఎక్కువ స‌మాచారం ఇవ్వ‌లేమ‌ని అధికారులు చెబుతున్నారు.  

Related Articles

Latest Articles