దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ ప్రెసిడెంట్ మోహిత్ జోషి రాజీనామా చేశారు. ఇన్ఫీకి రాజీనామా చేసిన ఆయన టెక్ మహీంద్రాలో చేరారు. 2000 నుండి ఇన్ఫోసిస్‌లో భాగమైన మోహిత్ జోషి టెక్ మహీంద్రాలో మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా నియమితులయ్యారు. ఈ విషయాన్ని బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ కు రెండు కంపెనీలు తెలిపాయి.
Also Read:Anil Kumar Yadav: ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనైతిక పొత్తులకు బుద్ధి చెప్పండి
మార్చ్ 11 నుంచి మోహిత్ జోషి సెలవులో ఉంటారని జూన్ 9వ తేదీ తమ కంపెనీలో ఆయనకు చివరి రోజు అని ఇన్ఫోసిస్ ప్రకటించింది. కంపెనీకి ఆయన చేసిన సేవలు చాలా గొప్పవని ఇన్ఫోసిస్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కొనియాడారు.ఇన్ఫోసిన్ ప్రెసిడెంట్ గా ఫైనాన్సియల్ సర్వీసెస్, హెల్త్ కేర్, లైఫ్ సైన్సెస్ బిజినెస్ ను మోహిత్ జోషి పర్యవేక్షించారు.