ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఒక్కటే చర్చ.. అతే కొత్త వేరియంట్ ఒమిక్రాన్.. సౌతాఫ్రికాలో వెలుగు చూసిన ఈ వేరియంట్ ఇప్పటికే 30 దేశాలను చుట్టేసింది.. భారత్‌లోనూ ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి.. అంతేకాదు.. వీరిలో ఒకరి నుంచి ఐదుగురికి కరోనా సోకినట్లు కర్ణాటక సర్కార్ ప్రకటించింది.. ఇక, ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీట్‌మెంట్ ప్రక్రియ కొనసాగుతుండగా… అధికారులకు షాక్ ఇచ్చాడు ఒమిక్రాన్ పాజిటివ్‌గా తేలిని వ్యక్తి.. ఒమిక్రాన్ వైరస్ సోకినట్లుగా తేలిన ఇద్దరిలో ఒకరు ఎస్కేప్ అయ్యాడట.. ఏకంగా భారత్ వదిలి దుబాయ్ వెళ్లిపోయినట్లు తెలియడంతో షాక్ తినడం అధికారుల వంతు అయ్యింది.
Read Also: మాజీ మంత్రి దేవినేని ఇంట విషాదం..
ఈ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు భారత్‌లో మొదట రెండు వెలుగు చూశాయి.. అందులో ఒకరు 66 ఏళ్ల వ్యక్తి… నవంబర్ 20న భారత్‌కు వచ్చిన ఆయన.. ఆ తర్వాత ఏడు రోజులకే మరో విమానంలో దుబాయ్‌కి వెళ్లిపోయినట్లు అధికారులు చెబుతున్నారు.. బెంగళూరు అధికారుల రికార్డుల ప్రకారం ఆ వ్యక్తి దక్షిణాఫ్రికా నుంచి నవంబర్ 20వ తేదీన బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌లో కరోనా నెగెటివ్ రిపోర్ట్ తో అడుగుపెట్టాడు.. ఆయన దక్షిణాఫ్రికా జాతీయుడు.. అదే రోజు బెంగళూరులోని ఓ హోటల్‌లో దిగాడు.. అయితే, ఇక్కడ నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల్లో పాజిటివ్ తేలింది.. కానీ, ఎలాంటి లక్షణాలు అతనిలో కనిపించలేదని వైద్యులు చెబుతున్నమాట.. ఇక, పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో సెల్ఫ్ క్వారంటైన్ లో ఉండాలని సూచించారు వైద్యులు.. ఇక, శాంపిల్స్ జన్యు పరీక్షలకు కూడా పంపించారు.. అతనితో కాంటాక్ట్ అయినవారికి కూడా టెస్ట్‌లు చేశారు.. కానీ, నవంబర్ 27వ తేదీ అర్ధరాత్రి హోటల్ నుంచి చెక్ అవుట్ చేసి క్యాబ్‌లో ఎయిర్‌పోర్టుకు చేరుకుని దుబాయ్‌కి విమానం ఎక్కి వెళ్లిపోయినట్టుగా తర్వాత గుర్తించారు అధికారులు.. ఆ తర్వాత అతని శాంపిల్స్ లో ఒమిక్రాన్ వైరస్ పాజిటివ్ గా వచ్చినట్టు గుర్తించి.. అతనిపై ఆరా తీయగా.. అప్పటికే అతడు దేశాన్ని వీడినట్టు తెలిసి షాక్ తిన్నారు.