Site icon NTV Telugu

‘ఇండియన్ ఐడల్ 12’ గ్రాండ్ ఫినాలే : ఒకే వేదికపై ‘టాప్ టెన్ టైటిల్ విన్నర్స్’!

ఆగస్ట్ 15వ తేదీన ఇండియన్ ఐడల్ సీజన్ 12 ముగియనుంది. రికార్డు స్థాయిలో 12 గంటల పాటూ గ్రాండ్ ఫినాలే అలరించనుందట! అయితే, గతంలో ఇండియన్ ఐడల్ టైటిల్ గెలిచిన విజేతలంతా ఒకే వేదికపైకి వస్తారని టాక్ వినిపిస్తోంది. అదే నిజమైతే… ఎవరెవరు రాబోతున్నారు? ఇండియన్ ఐడల్స్ గా ఇంతకు ముందు నిలిచిన వారెవరు? లెట్స్ హ్యావ్ ఏ లుక్…

Read Also: ‘డ్రామా జూనియర్స్’ లో రాజేంద్రుడి రచ్చ!

ఇండియన్ ఐడల్ మొట్ట మొదటి సీజన్ విజేత అభిజీత్ సావంత్. ఆయన తరువాతి కాలంలో ఎన్నో బాలీవుడ్ చిత్రాల్లో పాటలు పాడాడు. రెండో ఇండియన్ ఐడల్ గా నిలిచాడు సందీప్ ఆచార్య. దురదృష్టవశాత్తూ ఈయన 2015లో జాండిస్ తో మరణించటంతో ప్రస్తుతం మన మధ్య లేరు! 2007లో మూడో ఇండియన్ ఐడల్ గా టైటిల్ గెలిచాడు ప్రశాంత్ తమంగ్. ఈయన తరువాతి కాలంలో నేపాలి సినిమాల్లో కూడా నటించి మెప్పించాడు.

Read Also: జాన్వీ సెక్సీ ఫిగర్ వెనుక సీక్రెట్… ‘జిమ్’మంది నాదం!

సౌరబీ దేబ్ బర్మా… ఈమె ఇండియన్ ఐడల్ చరిత్రలో చాలా ప్రత్యేకం! ఎందుకంటే ఈ టాలెంటెడ్ సింగర్ కేవలం నాలుగో సీజన్ విజేత మాత్రమే కాదు… ఫస్ట్ లేడీ ఇండియన్ ఐడల్ కూడా!
ఇండియన్ ఐడల్ సీజన్ 5… తెలుగు వారికి మరింత ప్రత్యేకం! ఎందుకంటే, మన శ్రీరామ చంద్ర జాతీయ స్థాయిలో అందర్నీ ఒప్పించి, మెప్పించి టైటిల్ కైవసం చేసుకున్నాడు. ‘ఎంఎస్ ధోనీ – ద అన్ టోల్డ్ స్టోరీ’ లాంటి సినిమాల్లో చక్కటి పాటల్ని కూడా ఆలపించాడు.ఇండియన్ ఐడల్ 6 విన్నర్ విపుల్ మెహత…

2013లో ఇండియన్ ఐడల్ జూనియర్స్ షో మొదలైంది. అంజనా పద్మనాభన్ తొలి ఇండియన్ ఐడల్ జూనియర్ గా చరిత్ర సృష్టించింది. ఇండియన్ ఐడల్ 8 కూడా ఒక టాలెంటెడ్ జూనియర్ సింగర్ కే వశమైంది! అనన్య నందా అప్పట్లో టైటిల్ సాధించింది…ఇండియన్ ఐడల్ సీజన్ 9లో మరోసారి తెలుగు తేజం వెలిగిపోయాడు. ‘ఇండియన్ ఐడల్ 5’గా శ్రీరామచంద్ర నిలిస్తే ఇండియన్ ఐడల్ 9 ఎల్వీ రేవంత్ స్వంతం చేసుకున్నాడు. ఈయన తెలుగులోనే కాదు హిందీ, కన్నడ భాషల్ని కలుపుకుని వందల సంఖ్యలో పాటలు పాడాడు!

Read Also: మామని సైతం బీట్ చేసిన అల్లుడు! కోలీవుడ్ నంబర్ వన్… ధనుష్!

ఇండియన్ ఐడల్ 10 టైటిల్ సల్మాన్ అలీ సాధించుకున్నాడు…ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్… గత సీజన్ విజేత… సన్నీ హిందూస్థానీ. ఇండియన్ ఐడల్ 11 టైటిల్ ఆయన వశమైంది. ఇప్పటి వరకూ మొత్తం 11 మంది ఇండియన్ ఐడల్ టైటిల్ విజేతలుండగా… సీజన్ టూ విన్నర్ సందీప్ ఆచార్య అకాల మరణం పాలయ్యాడు. ఆయన్ని మినహాయించి మిగతా ‘టాప్ టెన్ టాలెంటెడ్ టైటిల్ విన్నర్స్’ ఇండియన్ ఐడల్ 12 ఫైనల్ కి హాజరవుతారట!

Exit mobile version