మామని సైతం బీట్ చేసిన అల్లుడు! కోలీవుడ్ నంబర్ వన్… ధనుష్!

అల్లుడు ధనుష్ మామ రజనీకాంత్ ని కూడా దాటేశాడు! అంతే కాదు, కమల్ హాసన్, విజయ్, సూర్య… కోలీవుడ్లో మరే స్టార్ కూడా ధనుష్ తో పోటీ పడలేకపోతున్నాడు! ట్విట్టర్ లో మన టాలెంటెడ్ యాక్టర్ దూకుడు అలా ఉంది మరి!

తమిళంతో మొదలు పెట్టి బాలీవుడ్, హాలీవుడ్ దాకా విస్తరిస్తోన్న ధనుష్ సొషల్ మీడియాని కూడా వదలటం లేదు. ట్విట్టర్ లో ఆయన తాజాగా 10 మిలియన్ ఫాలోయర్స్ మార్కుని దాటాడు. ఇంత భారీగా అనుచరులు కోలీవుడ్ లో మరెవరికీ లేక పోవటం విశేషం! తలైవాకి, ఇళయదళపతికి బాక్సాఫీస్ వద్ద బోలెడంతా మాస్ ఫాలోయింగ్ ఉన్నా సొషల్ మీడియాలో మాత్రం ధనుష్ దే హవా!

Read Also: యంగ్ రెబల్ స్టార్ తో త్రివిక్రమ్ సినిమా!

కమర్షియల్ సక్సెస్ లు, మంచి కథా బలమున్న అవార్డ్ మూవీస్… రెండూ తన ఖాతాలో వేసుకునే ధనుష్ జాతీయ అవార్డు కూడా పొందటంతో ఈ మధ్యే వార్తల్లో నిలిచాడు. మరోవైపు నెక్ట్స్ ఈ టాలెంటెడ్ స్టార్ కనిపించబోయే చిత్రాలు కూడా బోలెడు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. బాలీవుడ్ తెరపై మరోసారి కనిపించనున్న ధనుష్ ‘అత్రంగీ రే’ సినిమాతో రాబోతున్నాడు. అలాగే, హాలీవుడ్ ప్రాజెక్ట్ ‘గ్రే మ్యాన్’లోనూ ఆయన కీలక పాత్ర పోషించాడు. చూడాలి మరి, ధనుష్ తన హిందీ, ఇంగ్లీష్ సినిమాలతో క్రిటిక్స్ అండ్ ఆడియన్స్ నుంచీ ఎలాంటి రెస్పాన్స్ స్వంతం చేసుకుంటాడో…

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-