‘డ్రామా జూనియర్స్’ లో రాజేంద్రుడి రచ్చ!

నటకిరీటి రాజేంద్రప్రసాద్ ఎక్కడ ఉంటే అక్కడ సందడే సందడి! కామెడీ చిత్రాల హీరో నుండి క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారినా, రాజేంద్రుడి వినోదపు జల్లుకు ఫుల్ స్టాప్ పడలేదు. దానికి తాజా ఉదాహరణ ఆ మధ్య వచ్చిన ‘గాలి సంపత్’ చిత్రం. అందులోనూ ఒక కంట పన్నీరు మరో కంట కన్నీరు ఒలికించారు రాజేంద్ర ప్రసాద్. జూలై 19 నటకిరీటి పుట్టిన రోజు. ఈ సందర్భంగా ప్రస్తుతం ఆయన నటిస్తున్న సినిమాలకు సంబంధించిన పోస్టర్స్ ను దర్శక నిర్మాతలు జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తూ రిలీజ్ చేశారు.

ఇదిలా ఉంటే రాజేంద్ర ప్రసాద్ బర్త్ డే వేడుకను తాను అమితంగా అభిమానించే పిల్లల మధ్య ఇటీవల చేసుకున్నారు. జీ తెలుగులో ప్రసారం అవుతున్న డ్రామా జూనియర్స్ కార్యక్రమానికి ఈ మధ్య రాజేంద్ర ప్రసాద్ స్పెషల్ గెస్ట్ గా హాజరయ్యారు. ఆయనతో పాటు ప్రముఖ దర్శకులు ఎస్వీ కృష్ణారెడ్డి, నటుడు అలీ, గాయని సునీత, వ్యాఖ్యత, నటుడు ప్రదీప్ ఇందులో పాల్గొన్నారు. వీరందరి సమక్షంలో రాజేంద్ర ప్రసాద్ బర్త్ డే కేక్ కట్ చేశారు. విశేషం ఏమంటే… రాజేంద్ర ప్రసాద్ పై ప్రత్యేక గీతాన్ని రాయించి, ఈ కార్యక్రమంలో ప్రదర్శించారు. అంతేకాదు… రాజేంద్ర ప్రసాద్ సినిమా టైటిల్స్ వచ్చేలా పిల్లలు ఓ స్కిట్ ను ప్రదర్శించారు. రాజేంద్ర ప్రసాద్ సినిమాలకు సంబంధించిన పాటలనూ చిన్నారులు తమ స్కిట్స్ మధ్యలో ఉపయోగించారు.

రాజేంద్ర ప్రసాద్ కు తెలియకుండానే ఈ కార్యక్రమానికి ఆయన మనవరాలు బేబీ తేజస్విని హాజరైంది. ‘తాతా నేను లేకుండా నువ్వు బర్త్ డే చేసుకుంటావా?’ అంటూ ఎదురు ప్రశ్నించి, అందరినీ ఆకట్టుకుందీ చిన్నారి. అల్లరి విషయంలో ఇంట్లో తామిద్దరం పోటీ పడతామని రాజేంద్ర ప్రసాద్ చెప్పడం కొసమెరుపు. ఇదిలా ఉంటే రాజేంద్ర ప్రసాద్ రచ్చ రచ్చ చేసిన ఈ కార్యక్రమం జీ తెలుగులో ఈ నెల 25వ తేదీ ఆదివారం ప్రసారం కాబోతోంది. దీనికి సంబంధి విడుదలైన ప్రోమోకూ సూపర్ రెస్పాన్స్ వస్తోంది.

'డ్రామా జూనియర్స్' లో రాజేంద్రుడి రచ్చ!
'డ్రామా జూనియర్స్' లో రాజేంద్రుడి రచ్చ!
'డ్రామా జూనియర్స్' లో రాజేంద్రుడి రచ్చ!
'డ్రామా జూనియర్స్' లో రాజేంద్రుడి రచ్చ!
-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-