NTV Telugu Site icon

ఒమిక్రాన్‌ టెన్షన్‌.. భారత్‌, సౌతాఫ్రికా మ్యాచ్‌పై కీలక నిర్ణయం..

సౌతాఫ్రికాలో వెలుగు చూసిన కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ ఇప్పుడు ప్రపంచాన్ని చుట్టేస్తోంది.. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 62 వేలు దాటేసి డేంజర్‌ బెల్స్‌ మోగిస్తోంది.. ఈ సమయంలో అన్ని దేశాలు ఒమిక్రాన్‌ కట్టడి చర్యలకు పూనుకుంటున్నాయి.. ఇదే సమయంలో.. ద‌క్షిణాఫ్రికా పర్యటనకు బయల్దేరి వెళ్లిపోయింది టీమిండియా… ఈ టూర్‌లో టెస్టు, వ‌న్డే సిరీస్‌లు ఆడ‌బోతోంది. అందులో భాగంగా డిసెంబ‌ర్ 26వ తేదీ నుంచి సెంచురియాన్‌లో భారత్-సౌతాఫ్రికా మధ్య తొలి టెస్ట్‌ మ్యాచ్ జరగబోతోంది.. అయితే, ఆ దేశంలో ఒమిక్రాన్‌ వేరియంట్‌ కేసుల తీవ్రత కొనసాగుతుండడంతో మ్యాచ్‌పై కీలక నిర్ణయం తీసుకుంది దక్షిణాఫ్రికా క్రికెట్‌ బోర్డు.. తొలి టెస్ట్‌ మ్యాచ్‌ను ఖాళీ స్టేడియంలో నిర్వహించాలన్న నిర్ణయానికి వచ్చింది.

Read Also: పీఆర్సీపై కసరత్తు ముమ్మరం.. ఎప్పుడైనా ప్రకటన..!?

కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్ కేసులు జెట్‌ స్పీడ్‌తో వ్యాపిస్తున్న సమయంలో క్రికెట్ మ్యాచ్‌కు ప్రేక్షకులు గుంపులుగా వస్తే ఇన్‌ఫెక్షన్ మరింత పెరిగే అవకాశం ఉందని.. మరింత మందికి కొత్త వేరియంట్‌ సోకే ప్రమాదం ఉందని భావిస్తోన్న సౌతాఫ్రికా క్రికెట్‌ బోర్డు.. ఈ నిర్ణయానికి వచ్చింది. అందుకు మ్యాచ్‌కు సంబంధించి టికెట్లను విక్రయించకూడదని నిర్ణయించింది. అయితే, తొలి మ్యాచ్‌ వరకే ఈ నిర్ణయం అమలు చేయనున్నారు.. కానీ, జ‌న‌వ‌రి 3వ తేదీ నుంచి జరగబోయే రెండో టెస్ట్‌ మ్యాచ్‌కు ప్రేక్షకుల ఎంట్రీపై ఇంకా ఓ నిర్ణయానికి రాలేదు సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు.