Site icon NTV Telugu

Ind vs Aus 1st ODI: ముంబైలో వాతావరణ సూచన ఏమిటి?

Match Weather

Match Weather

ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగే తొలి వన్డేలో ఆస్ట్రేలియాతో భారత్ తలపడనుంది. వన్డే ఫార్మాట్లో ఈ ఏడాదిని గొప్పగా ఆరంభించిన టీమ్‌ ఇండియా అదే జోరు కొనసాగించాలని అనుకుంటోంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్(WTC) ఫైనల్‌లో తమ స్థానాలను దక్కించుకున్న తర్వాత, ఈ ఏడాది 50 ఓవర్ల ప్రపంచ కప్‌కు సిద్ధమవుతున్నాయి ఇరు జట్లు. రెండు సిరీస్‌ల్లోనూ న్యూజిలాండ్‌, శ్రీలంకలతో ఆడిన ఆరు మ్యాచ్‌ల్లోనూ భారత్‌ గెలిచింది. తొలి వన్డేలోనూ బోణి కొట్టాలని ప్లాన్ చేస్తోంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ శుక్రవారమే మొదలవుతోంది. భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభమవుతుంది
Also Read:BJP: రాహుల్‌ లండన్ ప్రసంగంపై దుమారం.. క్షమాపణ చెప్పాల్సిందేనని బీజేపీ డిమాండ్

క్రికెట్ మ్యాచ్ జరగాలంటే పరిస్థితులు అనుకూలించాయి. అల్పపీడన ద్రోణి ప్రభావంతో ముంబైలో వర్షం పడుతుందనే ప్రచారం జరిగింది. అయితే, ముంబై వేదికగా జరగనున్న తొలి వన్డేకు వాతావరణ సూచన క్రికెట్ అభిమానులకు అనుకూలంగా ఉంది. వాతావరణం క్రికెట్ మ్యాచ్‌కు అనుకూలంగా ఉందని అధికారులు తెలిపారు. తేమ 46 శాతం ఉంటుందని అంచనా. మ్యాచ్ జరుగుతున్న కొద్దీ ఉష్ణోగ్రత 33 డిగ్రీల సెల్సియస్ నుండి తగ్గే అవకాశం ఉంది.
Also Read:Gold prices: పిసిడి ప్రియులకు షాక్.. పెరిగిన బంగారం ధర.. ఈ రోజు రేటు ఎంతంటే..

ఇక, తొలి వన్డేలో కెప్టెన్ రోహిత్ శర్మ గైర్హాజరీలో భారత్‌కు నాయకత్వం వహించనున్నాడు హార్దిక్ పాండ్యా. సూర్యకుమార్‌, హార్దిక్‌, జడేజాలు కూడా ఉన్న భారత బ్యాటింగ్‌ లైనప్‌ బాగానే కనిపిస్తోంది. అయితే సూర్యకు ఈ సిరీస్‌ పరీక్షేగా మారనుంది. టీ20ల్లో చెలరేగి ఆడే అతడు.. ఎందుకో వన్డేల్లో అలాంటి ప్రదర్శన చేయలేకపోతున్నాడు. ఇప్పటివరకు వన్డేల్లో 18 ఇన్నింగ్స్‌ల్లో అతడి సగటు 28.86 మాత్రమే ఉంది. ఈ సిరీస్‌లోనైనా సూర్య రాణిస్తాడేమో చూడాలి. గాయాలతో శ్రేయస్‌, బుమ్రా దూరమవడం మాత్రం భారత్‌కు ప్రతికూలాంశమే. బుమ్రా గైర్హాజరీలో భారత పేస్‌ దళానికి సిరాజ్‌ నాయకత్వం వహించనున్నాడు. బౌలింగ్‌ గ్రూప్‌ చక్కగా పని చేస్తోందని పాండ్యా చెప్పాడు. ఇక, ఆసీస్ జట్టుకు స్మిత్‌ నాయకత్వం వహించనున్నాడు. కమిన్స్‌తో పాటు హేజిల్‌వుడ్‌, జేరిచర్డ్‌సన్‌ అందుబాటులో లేకపోయినా స్టార్క్‌, గ్రీన్‌ల రూపంలో ఆసీస్‌కు పేసర్లే ఉన్నారు.

Exit mobile version