Site icon NTV Telugu

ఆఫ్ఘ‌నిస్తాన్‌కు భార‌త్ సాయం: 5 ల‌క్ష‌ల వ్యాక్సిన్ డోసులు పంపిణి…

క‌రోనా స‌మ‌యంలో భార‌త్ అనేక దేశాల‌కు మాన‌వ‌తా దృక్ప‌దంలో స‌హాయం చేసింది. అమెరికాతో స‌హా అనేక దేశాల‌కు మందుల‌ను స‌ప్లై చేసింది.  కోవిడ్ మొద‌టి ద‌శ‌లో ఇండియా నుంచి మ‌లేరియా మెడిసిన్‌ను వివిధ దేశాల‌కు ఉచితంగా స‌ప్లై చేసింది.  క‌రోనా మ‌హ‌మ్మారికి వ్యాక్సిన్‌ను త‌యారు చేసిన త‌రువాత కూడా ఇండియా మిత్ర దేశాల‌కు మాత్ర‌మే కాకుండా ఇత‌ర దేశాల‌కు కూడా వ్యాక్సిన్‌ను మాన‌త‌వతా దృక్ప‌ధంలో అందించింది.  తాజాగా ఆఫ్ఘ‌నిస్తాన్‌కు 5 ల‌క్ష‌ల కోవాగ్జిన్ డోసుల‌ను స‌ర‌ఫ‌రా చేసింది. ఇండియాకు ఆఫ్ఘ‌నిస్తాన్ మిత్ర‌దేశం.  

Read: భ‌య‌పెడుతున్న రిపోర్ట్‌: జ‌న‌వ‌రి మూడో వారం వ‌ర‌కు 80 ల‌క్ష‌ల కేసులు…!!

అయితే, ప్ర‌స్తుతం ఆ దేశంలో తాలిబ‌న్ ప్ర‌భుత్వం అధికారంలో ఉన్న‌ది.  అయిన‌ప్ప‌టికీ అక్క‌డి ప్ర‌జ‌ల కోసం ఇండియా ముందుకు అడుగువేసింది.  తాలిబ‌న్లు కూడా ఇండియా స‌హాయాన్ని కోరిన సంగ‌తి తెలిసిందే.  ఇటీవ‌లే ఇండియా నుంచి గోధుమ‌ల‌ను కూడా ఆఫ్ఘ‌నిస్తాన్‌కు ఉచితంగా ఎగుమ‌తి చేసింది.  అదే విధంగా ఇప్పుడు 5 ల‌క్ష‌ల వ్యాక్సిన్ డోసుల‌ను ఆఫ్ఘ‌న్‌కు అందించింది.  ఈరోజు ఉద‌యం ఇండియా నుంచి స్పెష‌ల్ విమానంలో ఈ వ్యాక్సిన్‌ల‌ను కాబూల్‌కు చేర్చారు.  కాబూల్‌లోని ఇందిరాగాంధీ ఆసుప‌త్రికి ఈ వాక్సిన్ డోసుల‌ను త‌ర‌లిస్తున్నారు. 

Exit mobile version