Site icon NTV Telugu

మరో భారీ విజయంపై భారత్ కన్ను.. నేడు స్కాట్లాండ్‌తో ఢీ

టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా మరో సమరానికి సిద్ధమైంది. శుక్రవారం పసికూన స్కాట్లాండ్‌తో భారత్ తలపడనుంది. దుబాయ్ వేదికగా రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. కోహ్లీ సేన సెమీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే గత మ్యాచ్ తరహాలో ఈ మ్యాచ్‌లోనూ భారీ విజయం సాధించాల్సి ఉంది. ఆప్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ మంచి ఫామ్‌లోకి వచ్చినట్లు కనిపించారు. ఇద్దరూ హాఫ్ సెంచరీలు సాధించారు. ఈ మ్యాచ్‌లోనూ వారిద్దరూ చెలరేగి ఆడాలని భారత్ కోరుకుంటోంది. గత మ్యాచ్‌లో బౌలింగ్‌లో అశ్విన్, బుమ్రా, షమీ రాణించారు. దీంతో స్కాట్లాండ్‌తో మ్యాచ్‌లోనూ వారినే కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Read Also: వెస్టిండీస్‌పై 20 పరుగుల తేడాతో శ్రీలంక విజయం

అయితే మరోసారి ఈ మ్యాచ్‌లో టాస్ కీలకం కానుంది. వరుసగా టాస్‌లు ఓడిపోతున్న భారత కెప్టెన్ ఈ మ్యాచ్‌లో అయినా టాస్ గెలుస్తాడో లేదో వేచి చూడాలి. టీ20 ప్రపంచకప్‌లో ఈ రోజు మరో మ్యాచ్ కూడా జరగనుంది. న్యూజిలాండ్‌తో నమీబియా జట్టు ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్ రెండు జట్లకు పెద్ద కీలకం కాకపోయినా టీమిండియా సెమీస్ అవకాశాలను ప్రభావితం చేయనుంది. నమీబియా చేతిలో న్యూజిలాండ్ ఓడితే భారత్ సెమీస్ అవకాశాలు మెరుగుపడతాయి. మధ్యాహ్నం 3:30 గంటలకు షార్జా వేదికగా మ్యాచ్ ప్రారంభం కానుంది.

Exit mobile version