Site icon NTV Telugu

Covid-19: దేశంలో కోవిడ్ టెర్రర్.. 8 వేల చేరువలో కరోనా కేసులు

Corona

Corona

దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. నిన్నటి వరకు ఆరు వేలలోపు నమోదు అయిన కేసులు తాజాగా 8 వేల చేరువ అయ్యాయి. భారత్‌లో గత 24 గంటల్లో 7,830 కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం వెల్లడించింది. క్రియాశీల కేసుల 40,000 మార్కును దాటింది. ప్రస్తుతం దేశంలో 40,215 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రోజువారీ సానుకూలత రేటు 3.65% వద్ద నమోదు అయింది. క్రియాశీల కేసులు ఇప్పుడు మొత్తం ఇన్ఫెక్షన్‌లలో 0.09 శాతంగా ఉన్నాయి మరియు జాతీయ కోవిడ్ -19 రికవరీ రేటు 98.72 శాతంగా నమోదైంది. వ్యాధి నుండి కోలుకున్న వారి సంఖ్య 4,42,04,771కి పెరిగింది. అదే సమయంలో కరోనా మరణాల రేటు 1.19 శాతంగా ఉంది.
Also Read:Myanmar: మయన్మార్ లో వైమానిక దాడి.. చిన్నారులు సహా 100 మంది మృతి

దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద ఇప్పటివరకు దేశంలో 220.66 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్‌లు అందించబడ్డాయి. మంగళవారం దేశంలో గత 24 గంటల్లో 5,676 కొత్త కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇప్పుడు ఆ సంఖ్య భారీగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. మంగళవారం దేశ రాజధాని ఢిల్లీలో 980 కరోనా కేసులు వెలుగు చూశాయి. కోవిడ్ నియంత్రణ కోసం కేంద్రం మాక్ డ్రిల్ కూడా నిర్వహించింది.
Also Read:Karnataka: మాజీ సీఎంకు దక్కని టికెట్.. బీజేపీకి జగదీష్ షెట్టర్ సవాల్

మరోవైపు కేసుల సంఖ్య విపరీతంగా పెరగడంతో పలు రాష్ట్రాలు కూడా అప్రమత్తమైయ్యాయి. ముందస్తు చర్యలు చేపట్టాయి. కరోనా నిబంధనలు పాటించాలని ప్రభుత్వాలు ప్రజలను సూచిస్తున్నాయి. కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో, మాస్క్‌లు ధరించడం, హ్యాండ్ శానిటైజర్‌లను తరచుగా ఉపయోగించడం, భౌతిక దూర నిబంధనలను కొనసాగించడం వంటి చర్యలకు ఆదేశించాయి.

Exit mobile version