న్యూజిలాండ్ తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దాంతో టామ్ లాథమ్ కెప్టెన్సీ లోని కివీస్ జట్టు మొదట బౌలింగ్ చేయనుంది. అయితే ఈ రెండు జట్లు తలపడిన మొదటి మ్యాచ్ డ్రా గా ముగిసిన కారణంగా.. ఈ మ్యాచ్ లో ఎవరు గెలిస్తే ఈ సిరీస్ వారిదే. ఇక ఈ మ్యాచ్ కు ముందు రెండు జట్లలో ముఖ్యమైన ఆటగాళ్లు గాయం కారణంగా దూరమయ్యారు. అయితే అక్కడ ఈరోజు వర్షం లేకపోయినా.. గత వర్షాల కారణంగా పిచ్ తడిగా ఉన్న కారణంగా ఈ మ్యాచ్ లో టాస్ ఆలస్యం అయిన విషయం తెలిసిందే.
భారత జట్టు : మయాంక్ అగర్వాల్, గిల్, పుజారా, విరాట్ కోహ్లీ(c), శ్రేయాస్ అయ్యర్, వృద్ధిమాన్ సాహా(wk), రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, జయంత్ యాదవ్, ఉమేష్ యాదవ్, మహ్మద్ సిరాజ్
కివీస్ జట్టు : టామ్ లాథమ్ (c), విల్ యంగ్, డారిల్ మిచెల్, రాస్ టేలర్, హెన్రీ నికోల్స్, టామ్ బ్లండెల్(wk), రచిన్ రవీంద్ర, కైల్ జామీసన్, టిమ్ సౌతీ, విలియం సోమర్‌విల్లే, అజాజ్ పటేల్