Site icon NTV Telugu

చరిత్ర సృష్టించాం.. అందరికీ కృతజ్ఞతలు-ప్రధాని మోడీ

కోవిడ్ వ్యాక్సినేషన్‌లో ఇండియా మరో మైలురాయిని అధిగమించనుంది. ఇవాళ వందకోట్ల వ్యాక్సిన్‌లను పూర్తి చేసింది.. వంద కోట్ల టీకా మైలురాయి దాటగానే ఆనందం వ్యక్తం చేశారు ప్రధాని నరేంద్ర మోడీ.. సోషల్‌ మీడియా వేదికగా స్పందించిన ప్రధాని.. భారత్‌ చరిత్ర సృష్టించింది.. 130 కోట్ల మంది భారతీయులు.. భారతీయ సైన్స్, ఎంటర్‌ప్రైజ్ మరియు సమిష్టి స్ఫూర్తి సాధించిన విజయాన్ని మనం చూస్తున్నాం.. 100 కోట్ల టీకాలు దాటినందుకు భారతదేశానికి అభినందనలు.. మా వైద్యులు, నర్సులు మరియు ఈ ఘనత సాధించడానికి కృషి చేసిన వారందరికీ కృతజ్ఞతలు అంటూ ట్వీట్‌ చేశారు ప్రధాని మోడీ..

కాగా, టీకా పంపిణీలో భారత్‌ మరో మైలురాయి.. వంద కోట్ల డోసుల మార్క్‌ను దాటింది.. 100 కోట్ల డోసులను చేరడంతో కేంద్రం సంబరాల్లో మునిగిపోయింది.. ఇక, ఢిల్లీ రామ్‌ మనోహర్ లోహియా ఆస్పత్రిని సందర్శించారు మోడీ.. 100 కోట్ల వ్యాక్సిన్‌ మార్క్‌ చేరిన సందర్భంగా ఆర్‌ఎంఎల్‌కు వెళ్లారాయన.. మరోవైపు.. కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభించి ఇప్పటికి 9 నెలలు పూర్తైంది. ఇవాళ్టికి రికార్డుస్థాయిలో వందకోట్ల వ్యాక్సిన్‌లను .. కేంద్ర ఆరోగ్యశాఖ పూర్తి చేసింది.. ఈఘనతను దేశప్రజలకు వివరించేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. వందకోట్ల టీకా వేయగానే.. ఆ విషయాన్ని ట్రైన్లు, ప్లేన్లు, షిప్పుల్లో ప్రకటించింది భారత్.. దీనికి తోడుగా ఢిల్లీ ఎర్రకోట వద్ద జాతీయ జెండా ఎగురవేయనుంది.

Exit mobile version