ఎన్టీయార్, చెర్రీ ఫ్యాన్స్ కడుపు నింపేసిన రాజమౌళి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘బాహుబలి’ వంటి మేగ్నమ్ ఓపస్ మూవీ తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న రియల్ మల్టీస్టారర్ మూవీ ‘ట్రిపుల్ ఆర్’. ఈ సినిమాకు సంబంధించి ఏ చిన్న అప్ డేట్ అఫీషియల్ గా వచ్చినా చాలు ఎన్టీయార్, రామ్ చరణ్ ఫ్యాన్స్ కు ఆ రోజు పండగే! ఇవాళ అదే జరిగింది. సినిమా అప్ డేట్స్ తో సరిపెట్టకుండా రాజమౌళి ఈ మూవీకి సంబంధించిన సూపర్ డూపర్ క్రేజీ పోస్టర్ నూ విడుదల చేశారు. యంగ్ టైగర్ ఎన్టీయర్ కొమరం భీమ్ గా బైక్ నడుపుతుంటే… ఆ వెనకే చిరునవ్వులు రువ్వుతూ కూర్చున్నాడు అల్లూరి సీతారామరాజు ఉరఫ్ రామ్ చరణ్. కేవలం రెండు పాటల మినహా సినిమా షూటింగ్ మొత్తం పూర్తయిపోయిందని, ఎన్టీయార్, చెర్రీ రెండు భాషలలో డబ్బింగ్ కూడా పూర్తి చేశారని ప్రకటించారు. మిగిలిన కార్యక్రమాలూ శరవేగంగా సాగుతాయనే హామీని ఇచ్చింది చిత్ర యూనిట్.
ఇదంతా బాగానే ఉంది కానీ పనిలో పనిగా మూవీ రిలీజ్ డేట్ కూడా ప్రకటిస్తే బాగుండేదని చాలామంది అభిప్రాయపడ్డారు. మిగిలింది రెండు పాటలు, కొంత పోస్ట్ ప్రొడక్షన్ వర్కే కాబట్టి…. ముందు అనుకున్నట్టు అక్టోబర్ 13న ఈ సినిమాను విడుదల చేసే ఆస్కారం లేకపోలేదనిపిస్తోంది. అయితే… రాజమౌళి వర్కింగ్ స్టైల్ తెలిసిన వారు మాత్రం… ఇంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ ను హడావుడిగా పూర్తి చేసి, జనం ముందు పెట్టడానికి ఆయన అంగీకరించరని అంటున్నారు.
సో… ఫ్యాన్స్ అంతా ‘ట్రిపుల్ ఆర్’ పోస్టర్ ట్రెండింగ్ న్యూస్ ను ఆస్వాదిస్తూ, రిలీజ్ డేట్ ప్రకటన కోసం వేచి ఉండాల్సిందే!
Also Read

తాజావార్తలు
-
Kalki 2 : కల్కి 2 అప్డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్
-
Sardar 2 : సర్దార్ ఆన్ యాక్షన్.. స్పై థ్రిల్లర్‌తో మళ్లీ రాబోతున్న కార్తీ
-
Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
-
Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
-
Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!