Site icon NTV Telugu

తిరుమలకు ఢిల్లీ ఐఐటీ నిపుణులు.. ఘాట్‌ రోడ్డు పరిశీలన

భారీ వర్షాలతో నెల్లూరుతో పాటు రాయలసీమ జిల్లాలు అతలాకుతలం అయ్యాయి.. ఇక, తిరుపతి, తిరుమలలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు.. శ్రీవారి భక్తులను ఇబ్బందులకు గురిచేశాయి.. తిరుమల ఘాట్‌ రోడ్డులు కోతకు గురయ్యాయి.. ఏకంగా 13 ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడడం, నాలుగు ప్రాంతాల్లో రోడ్డు దెబ్బతినడంతో.. తిరుమలకు రాకపోకలపై ఆంక్షలు కూడా విధించాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే, ఇవాళ తిరుమల ఘాట్‌ రోడ్డును పరిశీలించనుంది ఢిల్లీ ఐఐటీ నిపుణుల బృందం.

Read Also: జవాద్ తుఫాన్ ఎఫెక్ట్‌.. 95 రైళ్లు రద్దు

1973లో రెండో ఘాట్‌ రోడ్డును ఆర్ అండ్ బీ ఆధ్వర్యంలో నిర్మించింది టీటీడీ.. భారీ వర్షాల సమయంలో ఘాట్ రోడ్డులో పలు ప్రాంతాలలో కొండచరియలు విరిగిపడ్డాయి.. 10 రోజుల క్రితం నుంచి కురుస్తున్న వర్షాలతో 13 ప్రాంతాలలో కొండచరియలు విరిగిపడగా.. నాలుగు ప్రాంతాలలో రోడ్డు దెబ్బతినడంతో మరమత్తులు చేపట్టింది టీటీడీ.. తాజాగా నిన్నటి రోజున 16వ కిలో మీటర్‌ నుంచి పెద్ద బండరాళ్లు కూడా జారిపడ్డాయి.. దీంతో మూడు ప్రాంతాలలో రోడ్డు ధ్వంసమైంది.. 16వ కిలోమీటర్ వద్ద పూర్తిగా కోతకు గురైంది రోడ్డు.. ఇక, ఇవాళ రోడ్డును పరిశీలించనున్నారు ఢిల్లీ ఐఐటీ నిపుణులు కేఎస్ రావు, నరసింహారావు, టీటీడీ రిటైర్డ్ సీఈ రామచంద్రారెడ్డి. మరోవైపు, ప్రస్తుతం మొదటి ఘాట్ రోడ్డులోనే రాకపోకలు కొనసాగుతున్నాయి.. ఉదయం 4 గంటల నుంచి రాత్రి 9:30 గంటల వరకు వాహనాల అనుమతి ఇస్తున్నారు అధికారులు.. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ద్విచక్ర వాహనాల అనుమతి ఇస్తున్నారు.

Exit mobile version