NTV Telugu Site icon

బంపర్ ఆఫర్… రూ.99కే బిర్యానీ, 2 తులాల బంగారం, కిలో వెండి, ఐఫోన్

కస్టమర్లను ఆకర్షించడానికి పలువురు సరికొత్త ఆఫర్లను ప్రకటించి ఊరిస్తుంటారు. పోటీ తీవ్రంగా ఉన్న పరిస్థితుల్లో బిజినెస్‌లో నెగ్గుకురావాలంటే ఆఫర్లను ప్రకటించడం, డిస్కౌంట్లు ఇవ్వడం తప్పనిసరి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగరంలోని సరూర్‌నగర్‌లో ఓ రెస్టారెంట్ వినియోగదారులను ఆకర్షించేందుకు ఓ బంపర్ ఆఫర్‌ను ప్రవేశపెట్టింది.

Read Also: దొంగ బాబా కామ క్రీడలు.. మంత్రాల పేరు చెప్పి అక్కాచెల్లెళ్లపై…

భాగ్యనగర్‌లోని రేణు గ్రాండ్ రెస్టారెంట్ నిర్వాహకులు రూ.99తో బిర్యానీ కొనుగోలు చేసిన కస్టమర్లకు ఓ లక్కీ కూపన్ అందిస్తున్నారు. బిర్యానీ కొనుగోలు చేసిన వారు లక్కీ కూపన్ నింపి డ్రాప్ బాక్సులో వేయాలి. లక్కీ డ్రాలో గెలిచిన వారికి ఫస్ట్ ప్రైజ్‌గా రెండు తులాల బంగారు కాయిన్స్, రెండో బహుమతిగా కిలో వెండి, మూడో బహుమతిగా యాపిల్ ఐఫోన్ అందిస్తున్నారు. లక్కీ డ్రాను జనవరి 1, 2022 నాడు తీస్తామని నిర్వాహకులు వెల్లడించారు.