హుజురాబాద్ ఉప ఎన్నిక కౌంటింగ్‌లో బీజేపీ ముందంజలో ఉంది. ఓట్ల లెక్కింపు ప్రారంభంలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో వెనుకంజలో ఉన్నా… ఈవీఏంలలోని ఓట్ల లెక్కింపు ప్రారంభం నుంచి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ లీడ్‌లో కొనసాగుతున్నారు. తొలి రౌండ్‌లో 166, రెండవ రౌండ్‌లో 192, మూడవ రౌండ్‌లో 911 ఓట్ల ఆధిక్యతను సాధించారు.
నాలుగో రౌండ్ ముగిసే సరికి 1,825 ఓట్ల లీడ్‌లో ఉండగా.. ఐదో రౌండ్‌లో కూడా ఈటల తన సత్తా చాటి 2,169 ఓట్ల ఆధిక్యత సాధించారు. హుజురాబాద్, వీణవంక, జమ్మికుంట, ఇల్లందకుంట, కమలాపూర్ మండలాల వారీగా ఓట్లను లెక్కిస్తున్నారు.