Site icon NTV Telugu

హైదరాబాద్‌లో దారుణం.. భార్య తల నరికి పోలీస్‌ స్టేషన్‌కు తీసుకువెళ్లిన భర్త

హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో దారుణం చోటుచేసుకుంది. ఇమాద్‌నగర్‌లో నిద్రిస్తున్న భార్యను గొంతుకోసి ఓ భర్త అతి కిరాతకంగా హత్య చేశాడు. అనంతరం భార్య తలను తీసుకుని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి పోలీసుల ముందు లొంగిపోయాడు. వివరాల్లోకి వెళ్తే… 14 ఏళ్ల క్రితం సమ్రీన్ బేగం అనే అమ్మాయిని ఫర్వేజ్ అనే వ్యక్తి వివాహం చేసుకున్నాడు. అయితే భర్త వేధింపులు తాళలేక సమ్రీన్ బేగం గతంలోనే విడాకులు తీసుకుంది. ఈ నేపథ్యంలో భార్యకు నచ్చజెప్పి గత ఏడాది సమ్రీన్ బేగంను ఫర్వేజ్ మళ్లీ పెళ్లి చేసుకున్నాడు.

Read Also: వ్యవసాయ రంగంలో పెరిగిన కార్మికుల సంఖ్య

అయినా ఫర్వేజ్‌లో మార్పు రాలేదు. భార్యపై ఇంకా అనుమానం పెంచుకున్నాడు. గురువారం రాత్రి ఫుల్లుగా గంజాయి సేవించి శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో భార్య సమ్రీన్ నిద్రిస్తుండగా కత్తితో ఆమె గొంతు కోసి హత్యకు పాల్పడ్డాడు. భార్యపై అనుమానంతోనే అతడు దారుణానికి పాల్పడినట్లు స్థానికులు చెప్తున్నారు. మృతురాలు సమ్రీన్ బేగంకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. మృతురాలి డెడ్ బాడీని ఉస్మానియా ఆసుపత్రి మార్చురీకి తరలించారు.

Exit mobile version