స్వచ్ఛమైన, నిర్మలమైన ప్రేమకు గుర్తుగా తాజ్‌మహల్‌ను చెబుతుంటారు. ప్రపంచ వింతల్లో ఒకటైన తాజ్‌మహల్‌ను సందర్శించేందుకు నిత్యం వేలాది మంది సందర్శకులు వస్తుంటారు. తాజ్‌మహల్‌ను చూసి ఆనందించి వెళ్తుంటారు. ఎవరూ కూడా అందులో నివశించాలని అనుకోరు.
Read: బూస్టర్ డోస్‌పై ఐసీఎంఆర్ కీలక ప్రకటన…
అయితే, మధ్యప్రదేశ్ లోని బుర్హాన్‌పూర్‌కు చెందిన ప్రకాశ్ చోక్సీ అనే వ్యక్తి తన భార్యకు ప్రేమ కానుకగా నాలుగు బెడ్‌రూమ్‌లు, ధ్యానమందిరం, ఓ పెద్ద హాలు, లైబ్రరీ అచ్చుగుద్దినట్టు తాజ్ మహల్ లాంటి ఇల్లును నిర్మించి ఇచ్చారు. బుర్హాన్‌పూర్‌లో ఈ ఇల్లు ఇప్పుడు వైరల్‌గా మారింది. మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్‌పూర్ వచ్చిన వ్యక్తులు ప్రకాశ్ చోక్సీ ఇంటిని చూడకుండా వెళ్లరు. ఈ ఇంటి నిర్మాణం కోసం మూడేళ్లు సమయం పట్టిందని చోక్సీ పేర్కొన్నారు.
