బూస్ట‌ర్ డోస్‌పై ఐసీఎంఆర్ కీల‌క ప్ర‌క‌ట‌న‌…

క‌రోనా మ‌హ‌మ్మారికి చెక్ పెట్టేందుకు వ్యాక్సిన్‌ను పెద్ద ఎత్తున అందిస్తున్న సంగ‌తి తెలిసిందే.  రెండు డోసుల వ్యాక్సిన్‌తో పాటుగా కొన్ని దేశాల్లో బూస్ట‌ర్ డోస్‌ను అందిస్తున్నారు.  అమెరికా ప్ర‌భుత్వం 18 ఏళ్లు నిండిన అంద‌రికి బూస్ట‌ర్ డోస్ అందిస్తున్న సంగ‌తి తెలిసిందే.  భార‌త్‌లో కూడా బూస్ట‌ర్ డోస్ ఇవ్వాల‌నే వాద‌న పెరుగుతున్న‌ది.  దీనిపై ఐసీఎంఆర్ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది.  

Read: రాజ‌ధాని బిల్లుల ఉప‌సంహ‌ర‌ణ‌పై బాబు స్పంద‌న‌: సీఎం వైఖ‌రితో రాష్ట్రానికి తీర‌ని న‌ష్టం…

బూస్ట‌ర్ డోస్ అవ‌స‌రం అనేందుకు ఎలాంటి శాస్త్రీయ నిరూప‌ణ లేద‌ని ఐసీఎంఆర్ తెలియ‌జేసింది. రెండు డోసులు ఇవ్వ‌డ‌మే ప్ర‌భుత్వ ప్రాధాన్యంగా ఐసీఎంఆర్ తెలియ‌జేసింది.  ఇక రాజ‌స్థాన్‌లో గ‌త కొద్ది రోజులుగా క‌రోనా కేసులు పెరుగుతున్నాయి.  ఈ నేప‌థ్యంలో రాష్ట్రంలో బూస్టర్ డోసులు అందించాల‌ని  సీఎం అశోక్ గెహ్లాట్ కేంద్రానికి విజ్ఞ‌ప్తి చేశారు.  దీనిపై త్వ‌ర‌లోనే ప్ర‌ధానికి లేఖ రాయ‌నున్నట్టు సీఎం పేర్కొన్నారు. 

Related Articles

Latest Articles