NTV Telugu Site icon

Bangladesh fire: బట్టల మార్కెట్‌లో భారీ అగ్నిప్రమాదం.. వందలాది దుకాణాలు దగ్ధం

Bangladesh Fire

Bangladesh Fire

బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని ప్రసిద్ధ క్లాత్ మార్కెట్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది, ఫలితంగా భారీ నష్టం జరిగింది. ఢాకాలోని ప్రసిద్ధ బట్టల మార్కెట్ అయిన బంగా బజార్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. పరిసరాలను నల్లటి పొగతో కప్పివేసింది. ఈ మార్కెట్‌లో 3 వేల దుకాణాలు ఉన్నాయి. సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పే పనిలో పడ్డారు. అయితే మంటల తీవ్రత ప్రమాదకర స్థాయికి చేరుకుంది.
Also Read: Congress: టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీలపై సీబీఐకి కాంగ్రెస్ ఫిర్యాదు

మార్కెట్‌లోని మంటలను ఆర్పే ప్రక్రియలో 600 మంది అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు. అయితే అగ్నిప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని సమాచారం. అగ్నిప్రమాదానికి కారణం ఇంకా తెలియలేదు. మంటల కారణంగా వందలాది దుకాణాలు దగ్ధమయ్యాయి. బంగా బజార్ మార్కెట్‌తో పాటు పక్కనే ఉన్న మూడు వాణిజ్య ప్రాంగణాలు దాదాపు పూర్తిగా దగ్ధమైనట్లు దుకాణ యజమానులు, అగ్నిమాపక అధికారులు తెలిపారు. వాయుసేన హెలికాప్టర్ అగ్నిమాపక సహాయక చర్యలకు వినియోగించనట్లు సైనిక ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. కాగా, దేశంలోని అతిపెద్ద మతపరమైన పండగ అయిన రంజాన్ వేడుకలకు ముందు చాలా మంది నిరాశ్రయులయ్యాయి.