గుజరాత్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ రాజీనామా చేశారు. ఈరోజు ఆయన తన పదవికి రాజీనామా లేఖను గవర్నర్‌కు సమర్పించారు. గత కొంతకాలంగా విజయ్ రూపానీ అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో ఆయన తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఇటీవలే ఓ సభలో విజయ్ రూపానీ మాట్లాడుతూ సడన్‌గా స్పృహతప్పి పడిపోయారు. అనారోగ్య కారణాల వలన తప్పుకుంటున్నట్టు విజయ్ రూపానీ చెబుతున్నా, త్వరలో గుజరాత్‌కు జరగబోయే ఎన్నికలకు కొత్త సీఎంతో వెళ్లాలని అనుకుంటున్నారని, అందుకే ఆయన తన పదవికి రాజీనామా చేశారని వార్తలు వస్తున్నాయి. ఏబీవీపీ కార్యకర్త స్థాయి నుంచి అంచలంచెలుగా ఎదిగి విజయ్ రూపానీ గుజరాత్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. ఇటీవలే కర్ణాటక ముఖ్యమంత్రిని మార్చిన బీజేపీ అధిష్టానం ఇప్పుడు గుజరాత్ ముఖ్యమంత్రిని మార్చింది. రాజ్‌కోట్ వెస్ట్ నుంచి విజయ్ రూపానీ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2016 ఆగస్టు 7 వ తేదీన గుజరాత్ కు 16వ ముఖ్యమంత్రిగా విజయ్ రూపానీ ప్రమాణస్వీకారం చేశారు.
గుజరాత్ రాజకీయాల్లో కీలక పరిణామం: ముఖ్యమంత్రి రాజీనామా… ఇదే కారణమా…
