ప్రస్తుతం మూడు గంటల్లో ముగిసిపోయే టీ20 మ్యాచ్‌లు క్రికెట్ ప్రియులకు ఎంతో వినోదాన్ని అందిస్తున్నాయి. అందుకే ఐపీఎల్, బిగ్‌బాష్ వంటి టోర్నీలు సూపర్ హిట్ అవుతున్నాయి. అయితే టీ20 క్రికెట్‌లో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ రంగాలకు సంబంధించిన పలు రికార్డుల గురించి మనకు తెలుసు. కానీ ధనాధన్ క్రికెట్‌లో అత్యధిక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు ఎవరు గెలుచుకున్నారో మీకు తెలుసా?
Read Also: దీపావళి అంటే చాలు.. రెచ్చిపోతున్న రోహిత్ శర్మ
అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అప్ఘనిస్తాన్ క్రికెటర్ మహ్మద్ నబీ అత్యధిక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులను గెలుచుకున్నాడు. అతడు మొత్తం 13 సార్లు ఈ ఘనత సాధించాడు. ఈ జాబితాలో రెండు, మూడు స్థానాల్లో టీమిండియా క్రికెటర్లు ఉన్నారు. రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ ఇప్పటివరకు పొట్టి క్రికెట్‌లో 12 సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గెలుచుకున్నాడు. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ 11 సార్లు ఈ ఘనత సాధించి మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. పాకిస్థాన్ క్రికెటర్లు షాహిద్ అఫ్రిది, మహ్మద్ హఫీజ్ కూడా 11 సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గెలుచుకుని రోహిత్ శర్మ సరసన నిలవడం గమనార్హం. కాగా బుధవారం అప్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.
