ఇటీవలే ఏపీలో నెల్లూరు కార్పొరేషన్‌తో పాటు 12 నగరపంచాయతీ, గ్రామపంచాయతీల ఎన్నికల జరిగిన విషయం తెలిసింది. అయితే కృష్ణా జిల్లా కొండపల్లి మున్సిపాలిటీలో 29 స్థానాలు ఉండగా 14 స్థానాల్లో వైసీపీ 15 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు గెలుపొందారు. అయితే 16 సభ్యుల కోరం ఉంటేనే చైర్మన్ ఎన్నిక నిర్వహించనున్న నేపథ్యంలో టీడీపీ ఎంపీ కేశినేని నాని ఎక్స్ అఫిషియో ఓటును వినియోగించుకోనున్నారు. ఈ నేపథ్యంలో కౌన్సిల్ కార్యాలయం వద్దకు నిన్న టీడీపీ, వైసీపీ శ్రేణులు చేరుకున్నారు. ఎంపీ కేశినేనిన ఓట్లు చెల్లదంటూ వైసీపీ శ్రేణులు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
దీంతో ఆర్వో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికను నేటి వాయిదా వేశారు. ఈ రోజు కూడా కౌన్సిల్ కార్యాలయం వద్ద గందరగోళం చోటు చేసుకోవడంతో ఆర్వో ఎన్నికను నిరవధిక వాయిదా వేశారు. దీంతో టీడీపీ సభ్యులు కొండపల్లి మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక వివాదంపై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేసింది. దీంతో విచారణ చేపట్టిన హైకోర్టు అగ్రహం వ్యక్తం చేసింది. విజయవాడ పోలీస్ కమిషనర్, కొండపల్లి మున్సిపల్ కమిషనర్‌లు కోర్టుకు రావాలని ఆదేశించింది. మధ్యాహ్నం 2.15 గంటలకు కోర్టుకు రావాలని సూచించింది.